Monday, May 5, 2025
- Advertisement -

జ‌గ‌న్‌తో కేంద్ర మాజీ మంత్రి మంత‌నాలు..

- Advertisement -

ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతోంది. పార్టీలోకి వ‌ల‌స‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి వైసీపీ కండువా క‌ప్పుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నారంట‌. గ‌తంలో కూడా పార్టీలో చేరుతార‌ని ప్ర‌చారం జ‌రిగినా కార్య‌రూపం దాల్చ‌లేదు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ వారిలో కొత్త టెన్స‌న్ ప‌ట్టుకుంది. త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు పై ఆందోళ‌న చెందుతున్నారు. అందుకే ఇప్పుడే ఏదొక బ‌ల‌మైన పార్టీలో చేరేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు.

కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాందీ రెండు రోజుల హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిసంగ‌తి తెలిసిందే. తెలంగాణాలో అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేస్తూనే ఏపీలో మాత్రం ఆశ‌లు వ‌దులుకున్నారు. ఇప్పుడే కోలుకోవడం కష్టమని తేల్చి చెప్పారు. టీడీపీతో పొత్తు ఉంటాద‌ని ప‌రోక్షంగా సంకేతాలు పంపారు రాష్ట్ర నాయ‌కుల‌కు.

2009 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన ఆమె మన్మోహన్ సింగ్ కేబినేట్లో కేంద్ర సమాచార మరియు టెలీకమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశారు డా. కిల్లి కృపారాణి. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో ఆమె ఘోరంగా ఓటమి చెందారు.

అటు కాంగ్రెస్ పార్టీలో ఉంటే తన రాజకీయ భవిష్యత్ కష్టమని భావిస్తున్న కృపారాణి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలోనే మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీలో చేరినప్పుడే ఆమె కూడా చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఆమె చేరకుండా కాంగ్రెస్ లోనే ఉండిపోయారు.

అందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే టెక్కలి అసెంబ్లీ సీటుపై దువ్వాడ శ్రీను మరియు పేరాడ తిలక్ లు పోటీ పడుతున్న నేపథ్యంలో టిక్కెట్ అసాధ్యమని వేరే స్థానం చూసుకోవాలని సూచించారట.

అయితే కళింగ సామాజిక వర్గానికి చెందిన కిల్లి కృపారాణి తన సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్న పలాస టిక్కెట్ ఇవ్వాలని కోరారట. అయితే జగన్ ఖచ్చితమైన హామీ ఇవ్వకపోవడంతో స్తబ్ధుగా ఉన్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ టికెట్ ఓకే అంటే పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -