Wednesday, May 7, 2025
- Advertisement -

బాబు ఎన్నికల వ్యూహం బూమరాంగ్ అవుతుందా? జగన్‌ని గెలిపిస్తుందా?

- Advertisement -

ఎన్డీఏతో తెగతెంపులు నిర్ణయం తీసుకునే నెలల కాలం ముందు నుంచే 2019 ఎన్నికల కోసం వ్యూహ రచన చేశాడు చంద్రబాబు. బిజెపి, టిడిపి, పవన్ కళ్యాణ్‌లు మరోసారి కలిసి ఎన్నిలకు వెళితే ముగ్గురికీ కూడా 2014ఎన్నికల్లో కాంగ్రెస్‌కి పట్టిన గతే పట్టడం ఖాయం అని బాబు సొంత సర్వేలతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా తేల్చిచెప్పాయి. పవన్‌కి కూడా ఆ విషయం అర్థమయింది. అందుకే అంతా మోడీదే తప్పు అని చంద్రబాబు ఎన్డీఏ నుంచి వైదొలిగితే…….చంద్రబాబు చేసేవన్నీ తప్పులే అని చెప్పి పవన్‌ టిడిపికి దూరం జరిగాడు.

అయితే చంద్రబాబు మాత్రం ఇప్పుడు అన్నీ తన మంచికే అని అనుకుంటున్నాడు. తాజాగా కిరణ్ కుమార్‌రెడ్డిని కూడా రంగంలోకి దించుతున్నాడు. పవన్ కళ్యాణ్, బిజెపి, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, జెడీఎస్ లక్ష్మీనారాయణ…..ఇలా ఎంత ఎక్కువ మంది ఎన్నికల్లో పోటీ చేస్తే అంతగా ఓట్లు చీలిపోతాయని…….ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోతే తాను మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అన్న విశ్లేషణలో చంద్రబాబు ఉన్నాడు. అన్నింటికీ మించి ఈ ఒక్క ఎన్నికల్లో జగన్‌ని ఓడించేస్తే ఇక నారా లోకేష్‌కి కూడా తిరుగే ఉండదు అన్నది చంద్రబాబు అభిప్రాయం. అయితే రీసెంట్‌గా గ్రౌండ్ లెవెల్‌లో చేసిన ఒక స్టడీ రిపోర్ట్ మాత్రం చంద్రబాబుకు షాకింగ్ రిజల్ట్స్ చెప్పింది. ఆంధ్రప్రదే్శ్ నాట ఎక్కువ శాతం ఓట్లన్నీ ఎప్పుడో పార్టీల వారీగా విడిపోయాయని……….ఇప్పుడు పవన్, జేడీఎస్ లక్ష్మీనారాయణ, బిజెపి……ఇలా పార్టీలన్నీ కూడా 2014 ఎన్నికల్లో టిడిపికి పడిన ఓట్లనే చీలుస్తాయని ఆ స్టడీ తేల్చి చెప్పింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం వైకాపా ఓట్లను చీల్చే అవకాశం ఉందని…….అయితే 2014 ఎన్నికల నాటికంటే ఇప్పుడు ఇంకా ఆ పార్టీ పరిస్థితి దిగజారిందని ఆ స్టడీ చెప్తోంది. అసలు కాంగ్రస్ పార్టీని సామాన్య జనాలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్న విషయం అర్థమవుతోంది. ఆ రకంగా చూసుకుంటే 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలుపుకు కారణమైన బిజెపి, పవన్ కళ్యాణ్ ఓట్లన్నీ కూడా ఇప్పుడు చీలిపోతే ……..ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా తోడైతే టిడిపి ఓటమి మాత్రం ఖాయం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా ఆంధప్రదేశ్ ప్రజలు జగన్‌ని ఒక్కడినే చూస్తున్న నిజం కూడా ఈ స్టడీలో బయటపడింది. ఢిల్లీ స్థాయి సీనియర్ జర్నలిస్టుల బృందం నిర్వహించిన ఈ స్డడీ ఫలితాలు త్వరలోనే అధికారికంగా విడుదల కానున్నాయి. మొత్తంగా ఈ స్టడీ ఫలితాలు చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటును బిజెపి, పవన్, జేడీఎస్, కాంగ్రెెస్, కమ్యూనిస్టులు లాంటి వాళ్ళందరూ చీలిస్తే తాను మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అన్న చంద్రబాబు విశ్లేషణ, వ్యూహ రచన బూమరాంగ్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని తేల్చేస్తోంది. నాలుగేళ్ళ పాటు బిజెపితో అధికారాన్ని పంచుకుని………ఎన్నికల ఏడాదిలో విభేదాల నాటకాలు ఆడుతున్న చంద్రబాబు, బిజెపి, పవన్ కళ్యాణ్‌లు అందరినీ ఇప్పటికీ కూడా ప్రజలు ఒకే గాటన కట్టి ఆలోచిస్తున్నారని, జగన్‌ని ఒక్కడినే వీళ్ళ ప్రత్యర్థిగా చూస్తున్నారన్న విషయం కూడా ఈ స్టడీలో బయటపడింది. ఎన్నికల ఏడాదిలో సర్వే ఫలితాలు, విశ్లేషణలన్నీ టిడిపి ఓటమి ఖాయం అని తేల్చేస్తున్న నేపథ్యంలో ముందు ముందు చంద్రబాబు వ్యూహరచనలో ఇంకా ఎన్ని మార్పులు ఉంటాయో, ఏ స్థాయిలో వ్యూహాలు ఉంటాయో అని కూడా టిడిపి శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికైతే మాత్రం గ్రౌండ్ లెవెల్‌లో వైకాపాకు టిడిపి కంటే 7శాతం ఓట్ల మార్జిన్ ఆదిక్యం ఉందని తాజాగా స్థానిక ఎన్నికల సంస్థ చేసిన సర్వేలో బయటపడింది. మోడీ గెలుపుతో పాటు, జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను కూడా కరెక్ట్‌గా చెప్పిన సంస్థ ఆధ్వర్యంలో ఈ సర్వే జరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -