Thursday, April 25, 2024
- Advertisement -

ఏపీ మంత్రులకు హైకోర్టు నోటీసులు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ మంత్రులకు తాజాగా రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం షాకిచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, గనులు & భూగర్భ శాస్త్ర శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గవర్నర్‌కు రాసిన లేఖల లీకేజీ వ్యవహారంలో ఎలక్షన్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇద్దరు మంత్రులకు నోటీసులు ఇచ్చింది.

వివ‌రాల్లోకెళ్తే.. గవర్నర్‌తో తాను జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరాల వివ‌రాలు అన్నీ ఎలా బయటకు లీకవుతున్నాయ‌నే విష‌యం పై విచార‌ణ జరపాలని నిమ్మగడ్డ ర‌మేష్ కుమార్ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. ఈ విష‌యంపై సీబీఐతో విచారణ జరిపించాలని త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. తాను గవర్నర్‌కు రాస్తున్న ప్రివిలేజ్ లెటర్స్ అన్నీ ఆఫీస్ నుంచి ఎలా బయటకు వస్తున్నాయో తేల్చాలని అందులో పేర్కొన్నారు.

ఆ పిటిష‌న్‌లో గవర్నర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం తాజాగా బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పెద్దిరెడ్డి ల‌కు నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచారణను వచ్చే మంగళవారంకు వాయిదా వేస్తున్న‌ట్టు న్యాయ‌స్థానం వెల్ల‌డించింది. హైకోర్టు ఇచ్చిన నోటీసులపై మంత్రి బోత్స సత్యనారాయణ తాజాగా స్పందిస్తూ.. నోటీసులు ఇచ్చిన విషయం ఇప్పుడే తెలిసింద‌నీ, కోర్టు ఆదేశాలు తప్పకుండా పాటిస్తామని వెల్ల‌డించారు.

రెండు డోసులు తీసుకున్న న‌ర్సుకు క‌రోనా

ఏపీకి ప్రత్యేక హోద ఇవ్వ‌లేం: కేంద్రం

నిమ్మరసం, పసుపు కలిపి తాగితే.. లాభాలేంటో తెలుసా?

కేంద్రంపై కేటీఆర్ ఫైర్

ల‌క్ష‌లాది మందికి న్యాయ సాయం అందట్లేదు: సుప్రీం జడ్జి జస్టిస్​ ఎన్వీ రమణ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -