వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర అధికారపార్టీ టీడీపీ నాయకుల గుండెల్లో అలజడి మొదలయ్యింది. నిన్నటి వరకు పాదయాత్రను ఆషామాషీగా తీసుకున్న బాబుకు నిద్రపట్టడంలేదు. అన్ని ప్రాంతాల్లోనూ జగన్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక వైపు సమీపిస్తున్న ఎన్నికలు మరో వైపు జగన్ పాదయాత్ర ఇలా రెండూ బాబును ఆలోచనలో పడేసింది. యనమల ఇలకాలో ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్ చూసి షాక్ తిన్నారంట యనమల, బాబు.
ఇటీవల తునిలో జరిగిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బహిరంగ సభకు కనీవినీ ఎరుగని రీతిలో స్పందన రావడాన్ని చూసి మంత్రి యనమల రామకృష్ణుడికి ఓ రేంజ్‌లో భయం పట్టుకుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజంగానే ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు పోటెత్తడంతో మంత్రి యనమలపట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందనడానికి ఈ పోటెత్తిన జనమే నిదర్శనమని రాజకీయ టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
తుని చరిత్రలో ఎప్పుడూ.. ఏ రాజకీయ నాయకుడికి రానంతగా జనం వచ్చినట్టు సాక్ష్యాత్తు ఏపీ ప్రభుత్వ ఇంటెలిజన్స్ వర్గాలే నివేదికలు ఇచ్చాయని తెలుస్తుంది. సీఎం తరువాత ఏపీ కేబినెట్‌లో మంత్రి యనమల చూసుకుంటారు అలాంటి యనమలను ఆయన నియోజకవర్గంలో ఇచ్చే ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురు అవనుంది. మంత్రి యనమల చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెల్లడంలో జగన్ సఫలమయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మంత్రి యనమల ఏ రేంజ్‌లో అవినీతికి పాల్పడుతున్నారో ప్రజలకు తెలియడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాహంసం అయింది..యనమల సోదరులు తునిలో చెలరేగిపోతున్న తీరుపట్ల ఇంటెలిజెన్స్ వర్గాలు తమ నివేదికలో స్పష్టం చేసినట్టు సమాచారం.
మంత్రి యనమల తన వియ్యంకుడు టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన కాంట్రాక్టు సంస్థకు నామినేషన్ పద్ధతుల్లో కాంట్రాక్టులు ఇప్పించడం.. వేల కోట్ల విలువైన పనులను వియ్యంకుడు సంస్థ ద్వారా చేపడుతున్న తీరును వైఎస్ జగన్ వివరించడంతో.. మంత్రి యనమల అవినీతి భాగోతం ప్రజలకు అర్థమైంది. మంత్రి యనమల కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపణలకు సమాధానం చెప్పలేక పోయారంట. సాక్షాత్తు అర్థిక మంత్రి ఇలాకాలోనే ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో ఎ జగన్ ప్రభావం ఎలా ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.