Wednesday, May 7, 2025
- Advertisement -

చంద్రబాబు తర్వాత అచ్చెన్నాయుడేనా!

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో టీడీపీ చీఫ్ చంద్రబాబుని అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు ఉండగా ఏ2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. ఇక చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ని విచారణ చేయనున్నారు. ఇక ఈ కేసులో మరికొంత మంది అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ప్రధాన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరు వినిపిస్తోంది. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు అచ్చెన్నాయుడిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేయనున్నారు సీఐడీ పోలీసులు.

ఇక చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ శ్రేణులు బాబు అరెస్ట్‌ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని తమ నాయకుడు ఎలాంటి తప్పుచేయలేదని రోడ్డెక్కి నిరసన చేస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో 2015 లో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ఇందు కోసం సిమెన్స్, డిజన్ టెక్ సంస్థలతో రూ.3,356 కోట్ల ప్రభుత్వం ఒప్పందం జరుగగా.. అందులో రూ.371 దారి మల్లాయని ఆరోపనలు వచ్చాయి. అగ్రిమెంట్‌కు జీవోలో ఉన్నదానికి స్పష్టంగా తేడా ఉండగా అనుమానాలు తలెత్తాయి. ఈ కేసులో విజిలెన్స్, ఏ‌సి‌బి విచారణ అనంతరం సీఐడీకి బదిలీ చేయగా చంద్రబాబును ఏ1 గా చేర్చుతూ పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేసింది సీఐడీ. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రస్తుతం టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -