ఏపీలో వైఎస్ జగన్‌ను దెబ్బకొట్టాలని బాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కుట్రరాజకీయాలకు తెరలేపారు. అసలు ప్రతిపక్షమే ఉండకూడదని బాబు వేసిన మాస్టర్ ప్లాన్ అట్టర్‌ప్లాప్ అయ్యింది.
అసలు విషయానికి వస్తే చంద్రబాబునాయుడు ఎంతో మోజుపడి ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ఫైబర్ నెట్ ప్రాజెక్టు ఫెయిల్ అయ్యిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఫైబర్ గ్రిండ్‌ను రాష్ట్రపతి చేత అట్టహాసంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంతమైన కృష్ణాజిల్లాలోనే ఈ ప్రాజెక్టు విఫలమైంది. ఒక్క కృష్ణా జిల్లాలోనే కాదు తొలిదశలో కనెక్షన్లు ఇచ్చిన చాలాచోట్ల ఫెయిలైనట్లే కనబడుతోంది. తొలిదశలో 1.10 లక్షల కనెక్షన్లు తీసుకున్నవారంతా తమకు కనెక్షన్లు వద్దంటూ నెత్తీ నోరు మొత్తుకుంటున్నారంటే ప్రయోగం ఎంతగా విఫలమైందో అర్దమైపోతోంది.
రానున్న ఎన్నికలను దృష్టిలో జగన్‌ను దెబ్బకొట్టేందుకు చంద్రబాబు భారీ స్కెచ్ చేశారు. రాష్ట్రం మొత్తం మీద లక్షలాది కనెక్షన్లు ఇవ్వటం ద్వారా ప్రచారం చేసుకోవాలని అనుకున్నారు. అందుకే రూ. 149 కే ఇంటర్నెట్, టెలిఫోన్, కేబుల్ టివి అంటూ ప్రభుత్వం ఊదరగొట్టింది. ఇంత చవకలో మూడు కనెక్షన్లు ఇవ్వటం నిజానికి సాధ్యం కాదు. కానీ చంద్రబాబు చెప్పినమాటలను జనాలు నమ్మి కనెక్షన్లు తీసుకోవటానికి ముందుకొచ్చారు. ప్రారంభమైన తర్వాత ఫైబర్ నెట్ లోని లోపాలు బయటపడుతున్నాయ్. తీరుచూస్తే అసలు బండారం బయటపడింది
బయటపడిన సమస్యలేంటంటే ఫైబర్ నెట్లో సమస్యలు వస్తే సరిచేయటానికి టెక్నీషియన్లు లేరు. సంబంధిత అధికారులు కూడా పట్టించుకోవటం లేదు. రూ. 4 వేలు పెట్టి కొనుగోలు చేసిన సెట్ టాప్ బాక్సుల్లో సాంకేతిక సమస్యలను సరిచేసే వారు లేరు. ఫలితంగా సేవలు పనిచేయటం లేదు.
ఫలితంగా ఫైబర్ నెట్ వర్క్ కనెక్షన్లు 8 వేల నుండి 300కి పడిపోయాయి. ఇక్కడ మాత్రమే కాదు ఫైబర్ నెట్ ఏర్పాటు చేసిన మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్ధితి కనబడుతోంది. బాబు ఏదో అనుకుంటే మొదటికే మోసం వచ్చింది.