చంద్రబాబు అంతే……..ఎన్ని అబద్ధాలు అయినా ఆడగలడు. ఎన్ని రకాల రాజకీయ కుట్రలు అయినా పన్నగలడు. ఫైనల్‌గా అధికారంలో దక్కిందా? లేదా? అన్నదే పాయింట్. రుణమాఫీలు నేనూ చేస్తా అన్న ఒక్క హామీ ఇస్తే ముఖ్యమంత్రి కుర్చీ కాళ్ళ దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ…..మాట ఇచ్చి మోసం చేయలేనని చెప్పి అధికారాన్ని త్యాగం చేశాడు జగన్. కానీ అత్యంత అనుభవజ్ఙుడిని…..పెద్ద రాష్ట్రానికే అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసిన తనకు చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఏం ఆశ ఉంటుంది అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం అధికారంలోకి రావడం కోసం అడ్డమైన అబద్ధాలన్నీ చెప్పి అధికారం దక్కించుకున్నాడు. నమ్మి ఓట్లేసిన ప్రజలను నిండా ముంచాడు. స్వయానా పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి…..ఆయనను ఆత్మక్షోభకు గురిచేసి ముఖ్యమంత్రి కుర్చీ లాక్కున్న చరిత్ర చంద్రబాబుది. చివరగా అధికారం ఒక్కటే చంద్రబాబు పరమావధి. అందుకోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు అన్నది చరిత్ర చెప్తున్న నిజం. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయాక కూడా నేను నిప్పు అంటూ అడ్డంగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటాడు. అలాంటి మరో అబద్ధంతోనే తాజాగా అడ్డంగా దొరికిపోయాడు చంద్రబాబు.
చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడిన నరేంద్రమోడీ. టిడిపి మంత్రులు రాజీనామాలు ఉపసంహరించుకునేలా చేయాలని……తొందరపడి స్నేహాన్ని తుంచెయ్యొద్దని మోడీ బ్రతిమాలుకున్నాడని రకరకాలుగా ప్రచారం చేసుకున్నాడు చంద్రబాబు. పచ్చ మీడియా కూడా అబద్ధపు రాతలన్నీ కథలు కథలుగా వండి వార్చింది. అయితే ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతున్న ఒక చర్చ చంద్రబాబు చెప్పిన అబద్ధాన్ని అడ్డంగా పట్టిస్తోంది. రాజీనామాలు ఉపసంహరించుకునేలా చెయ్యాలని……..పొత్తు తెంచుకోవద్దని చంద్రబాబును మోడీ బ్రతిమాలుకున్నాడని బాబు అండ్ బ్యాచ్ ప్రచారం చేసుకున్నారు కదా. మరి నిజంగా ఆ స్థాయిలో చంద్రబాబుతో పొత్తు చెడకూడదని మోడీ కోరుకుని ఉంటే రాజీనామా చేసిన వెంటనే టిడిపి మంత్రుల రాజీనామాలను అమోదించేలా ఎందుకు చేసినట్టు? చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడేమో అని కనీసం ఎందుకు వెయిట్ చెయ్యలేకపోయాడు మోడీ? రాజీనామాలు ఆమోదించే ఉద్ధేశ్యమే మోడీకి లేకపోయి ఉంటే టిడిపి మంత్రుల రాజీనామాలు ఎప్పటికీ ఆమోదం పొందవు అన్నది నిజం. అయితే మోడీ మాత్రం వెంటనే టిడిపి మంత్రుల రాజీనామాలు ఆమోదం పొందేలా చేశాడు. అన్నింటికీ మించి ఆ వెంటనే ప్రత్యామ్నాయ నాయకులను కూడా ఆ పదవుల కోసం చూస్తున్నాడు. ఇప్పుడు ఇదే విషయం జాతీయ స్థాయి మీడియాలోనూ…..ఢిల్లీలో ఉన్న రాజకీయ విశ్లేషకులను ఆశ్ఛర్యపరుస్తోంది. రాజీనామాలు ఉపసంహరించుకోవాలని మోడీ బ్రతిమాలుకున్నాడు…….బాబు దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు……బాబు చేతులు పట్టుకుని బ్రతిమాలాడు…..అనే రేంజ్‌లో బాబు ప్రచారం చేసుకున్నదానికి …..గంటల వ్యవధిలోనే టిడిపి మంత్రుల రాజీనామాలు ఆమోదం పొందేలా మోడీ చేసిన చర్యలకు అస్సలు పొంతన కుదరడం లేదన్నది నిజం.
ఇప్పుడు ఈ విషయాన్ని పరిశీలించాకే బాబు చెప్పిన అతి పెద్ద అబద్ధం ఇట్టే తెలిసిపోయింది. జాతీయ స్థాయి విశ్లేషకులు కూడా ముక్కున వేలేసుకునేలా చేసింది. ఒౌరా…….చంద్రబాబు ప్రచార మాయ……ఏ స్థాయి అబద్ధాలనైనా ప్రజలను గుడ్డిగా నమ్మించెయ్యగలం అని అంత బలంగా ఎలా నమ్ముతారో కదా. ఒకరు చెప్పారని కాదు కానీ పబ్లిసిటీ జిమ్మిక్స్….రాజకీయ కుట్ర సిద్ధాంతాలు రచించే విషయంలో మాత్రం చంద్రబాబును కొట్టే నాయకుడు దేశంలోనే లేడని చెప్పొచ్చేమో.