- Advertisement -
విశాఖ వేదికగా జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విశాఖ పార్లమెంట్ పరిధిలో జరిగిన ఓ గొడవను అనవసరంగా రాజకీయ రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసమే హింసను ప్రేరేపిస్తున్నారు… హింసాత్మక ఘటనల వ్యవహారంలో అనవసరంగా మాపై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
175 కి 175 సీట్లు సాధిస్తాం అని…. ప్రమాణ స్వీకరణ అయ్యాక రుషికొండలో కట్టిన భవనాలు ఎలా ఉపయోగించాలో నిర్ణయిస్తారన్నారు. గెలుపు మీద నమ్మకం లేకే టీడీపీ మహానాడు క్యాన్సిల్ చేసుకుందన్నారు.
ఈసీ తొందరపాటు నిర్ణయాల వల్లే హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని గవర్నర్ కు ఫిర్యాదు చేశాం అని తెలిపారు బొత్స. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చింది వైసీపీనే… ఈ క్రమంలో రాష్ట్రంలో మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం అవ్వకూడదని భావిస్తున్నామన్నారు.