ఏపీలో ప్రతిపక్షనేత జగన్ చేపడుతున్న పాదయాత్రపై అధికార పార్టీ నాయకల విమర్శలు తగ్గడంలేదు. బాబునుంచి మొదలు కొని మంత్రులు,ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు జగన్‌పై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పడు తాజాగా మంత్రి ఆదినారాయణరెడ్డి మరో సారి సంచలన కామెంట్స్ చేశారు.
జగన్ కాళ్ల నొప్పులు తెచ్చుకునేందుకు పాదయాత్రను చేపట్టబోతున్నారని ఎద్దేవా చేశారు . పాదయాత్ర చేయడం వల్ల ఆయన సీఎం కాలేరన్నారు. 3 వేల కిలోమీటర్లు కాదు, ముప్పైవేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా ఉపయోగం లేదని, వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని అన్నారు.
నవంబర్ 2వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇడుపులపాయ నుంచి చిత్తూరు జిల్లా మీదుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు యాత్ర కొనసాగనుంది. ఆరు నెలల పాటు దాదాపు 3వేల కిలోమీటర్ల దూరం ఆయన నడవనున్నారు. పాదయాత్ర ప్రారంభమయ్యేలోపు ఇంకా ఎలాంటి కామెంట్లు, పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.