Sunday, May 4, 2025
- Advertisement -

ఆంధ్రా నాకు జన్మనిస్తే.., తెలంగాణ పునర్జన్మనిచ్చింది

- Advertisement -

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం నాడు కరీంనగర్ శుభం గార్డెన్స్ లో కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ మూడు ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. ‘జై తెలంగాణ’ అని నినాదం తో ప్రసంగాన్ని పవన్ ప్రారంభించారు. జన సైనికుల ఉత్సాహం తనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. ఆంధ్రా తనకు జన్మనిస్తే, తెలంగాణ పునర్జన్మనిచ్చిందని వ్యాఖ్యానించిన ఆయన, “నేను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన వేళ, తెలంగాణకు గుండెకాయ అయిన కరీంనగర్ నుంచి ప్రస్థానం ప్రారంభించడం వెనుక ఓ కారణం ఉంది. ఇక్కడి గడ్డపై ఉన్న కొండగట్టు ఆంజనేయస్వామి నాకు పునర్జన్మనిచ్చాడు. అలాంటి తెలంగాణ నేలతల్లికి జీవితాంతం, ఆఖరి శ్వాస వరకూ నేను రుణపడి ఉంటానని అన్నారు. జై తెలంగాణ అంటే ఒళ్లు పులకరిస్తుందని పవన్ అన్నారు. వందేమాతరం లాంటి నినాదమే జై తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు.. తనకు ఏ ఒక్కరితోనూ వ్యక్తిగత ద్వేషాలు లేవని చెప్పిన ఆయన విధానాల పరంగానే తానెవరితోనైనా విభేదిస్తానన్నారు.

రాజకీయాలలోకి కొత్త రక్తం రావాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. తాను 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నానని చెప్పారు. తన జీవితంలో ఎక్కువ భాగం తెలంగాణతోనే పెనవేసుకుని ఉందన్నారు.తన సినిమాలలో తెలంగాణ భాష, యాస, సంస్కృతికి అధిక ప్రాధాన్యత నిచ్చానని పవన్ చెప్పారు. సామాజిక న్యాయం అంటే కేవలం సీట్లు, ఓట్లే కాదన్నారు. మన భాష, మన యాస, మన సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మతం ప్రస్తవన లేని విధానం జనసేన పార్టీదని చెప్పారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం జనసేన లక్ష్యమని అయన కల్యాణ్ ప్రకటించారు. రాజకీయాలలో కులాల ప్రస్తావన ఎక్కువైపోయిందని చెప్పిన పవన్ కల్యాణ్ కులాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలన్నారు. కొన్ని కులాలకే రాజకీయం పరిమితమైపోయిందన్నారు. సామాజిక న్యాయమంటే సీట్లు ఇవ్వడం కాదనీ, అందరినీ సమాన అవకాశాలు కల్పించడమని పేర్కొన్నారు.

తెలంగాణ. కొత్త రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. తెలంగాణ ఆడపడుచుల కోసం సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం కావాలని జనసేనాని పిలుపునిచ్చారు. మీ కోసం…మీ బాధలు తీర్చడం కోసం నేనున్ననని పవన్ కల్యాణ్ అన్నారు. తన రాజకీయ ప్రస్థానాన్ని తెలంగాణ నుంచి ఆరంభించడం ఆనందంగా ఉందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -