Monday, May 5, 2025
- Advertisement -

ఆది భ‌విష్య‌త్తులో త‌గిన మూల్యం చెల్లించుకుంటారు…

- Advertisement -

రెండురోజుల క్రితం టీడీపీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి ద‌ళితుల‌పై చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ద‌ళిత సంఘాలు ఆందోళ‌న చేయ‌డంతోపాటు…మంత్రిపై ఎస్‌సీ,ఎస్‌టీ అట్రాసిటీ కేసు పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఆది వ్యాఖ్య‌ల‌పై అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మంత్రి హోదాలో ఉండి కనీస పరిజ్ఞానం లేకుండా ఎస్సీలు చదువుకోరని, శుభ్రంగా ఉండరని చెప్పిన మంత్రి, క్షమాపణలు చెప్పకుండా, అలా అనలేదని తప్పించుకోవడం సిగ్గు చేటరన్నారు. సీఎంకు, మంత్రులకు సలహాదారులుగా ఉన్న ఐఏఎస్‌ ఆఫీసర్లలో ఎస్సీలు కూడా ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు.

మంత్రి ఆదినారాయణ రెడ్డి భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌.. ఎస్సీ, ఎస్టీలపైన అభిమానం, ప్రేమానురాగాలు చూపించేవారన్నారు. నంద్యాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలి పించి జననేతకు కానుకగా ఇవ్వాలని నంద్యాల ఓటర్లను కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -