Wednesday, May 7, 2025
- Advertisement -

కర్నూలులో బాబు దిమ్మతిరిగే షాక్…… వైకాపాలోకి ప్రజా బలం ఉన్న ఆ సీనియర్ నాయకుడు

- Advertisement -

2019 ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందో ఇప్పటికిప్పుడు చెప్పలేం కానీ ఎన్నికల ట్రెండ్స్ మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజాబలం ఉన్న నాయకులందరూ అధికారంలో ఉన్న టిడిపిని వదిలిపెట్టి ప్రతిపక్ష వైకాపాలో చేరుతూ ఉండడం రాజకీయ విశ్లేషకుల్ని కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. ఇక పొలిటికల్ ట్రెండ్స్‌ని పసిగట్టిన బ్యూరోక్రాట్స్ కూడా పూర్తిగా చంద్రబాబుకు వ్యతిరేకంగా మారిపోతున్నారు. బాబు తప్పులు, అక్రమాల సమాచారాన్ని మోడీకి చేరవేస్తున్నారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తాడు అన్న నమ్మకం ఇటు నాయకులకు, అటు ఉద్యోగులకు కూడా లేని పరిస్థితి.

అందుకే నాయకులందరూ కూడా వైకాపాలో చేరడానికి జగన్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి కూడా వైకాపాలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన కాటసాని టిడిపి, వైసిపిలాంటి రెండు బలమైన పార్టీలు పోటా పోటీగా రంగంలోకి దిగిన పాణ్యం నియోజకవర్గంలో ముఫ్పై వేల పైచిలుకు ఓట్టు గెల్చుకున్నాడు. కాటసాని రాం భూపాల్ రెడ్డి ప్రజాబలం ఏంటో ఈ విషయమే రుజువు చేస్తోంది. ఇక అలాంటి కాటసాని వైకాపాలో చేరితే పాణ్యం నియోజకవర్గంలో వార్ పూర్తిగా వన్ సైడ్ అవుతుందనడంలో సందేహం లేదు. అందుకే నారా చంద్రబాబు, లోకేష్‌లు కాటసానిని టిడిపిలోకి లాగాలని చాలా ప్రయత్నాలే చేశారు. అయితే కాటసాని మాత్రం వైఎస్ జగన్ సమక్షంలో వైకాపాలో చేరడానికే మొగ్గు చూపాడు. అన్నింటికీ మించి కార్యకర్తలు, అభిమానులు కూడా టిడిపిలో చేరవద్దని, బాబును నమ్మవద్దని కాటసానికి చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా ఆయనతో సన్నిహితంగా ఉన్న కాటసాని అన్ని విషయాలు ఆలోచించి….2019లో వైకాపానే అధికారంలోకి రావడం ఖాయమన్న అంచనాతోనే వైకాపాలో చేరడానికి నిర్ణయించుకున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -