కర్నూలు జిల్లాలో టీడీపీకీ మరో ఎదురు దెబ్బ తగిలింది. కొద్ద సేపటిక్రితం కడప జిల్లాలకు చెందిన మాజీ మంత్రి ,టీడీపీ నేత సాయిప్రతాప్ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది సేపటికే మరో షాక్ తగిలింది. ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యే వైసీపీ కండువా కప్పుకున్నారు. వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ దూసుకుపోతున్నారు. కర్నూలు జిల్లా ఎన్నికల ప్రచారంలో కొడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈసారి కోడుమూరు టికెట్ ను చంద్రబాబు తనకు కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యే మణిగాంధీ వైసీపీలో చేరారు.
2014 ఎన్నికల్లో కోడుమూరు నుంచి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన మణిగాంధీ ….ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. మరో సారి టికెట్ ఇస్తారని ఆశించి గాంధికి బాబు మొండిచేయి చూపారు. దీంతో మనస్థాపం చెందని మణిగాంధీ మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు.కోడుమూరు నుంచి వైసీపీ తరఫున పోటీచేస్తున్న డా.సుధాకర్ బాబు మణిగాంధీకి స్వయానా తోడల్లుడు కావడం గమనార్హం