కోమటిరెడ్డి కాంగ్రెస్ గుడ్ బై.. ఫలించిన బీజేపీ వ్యూహం !

- Advertisement -

తెలంగాణలో గతకొంత కాలంగా మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ కీలక నేత అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూ రాజకీయం నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ లో బలమైన నేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడే అవకాశం ఉందని గతకొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశించిన కోమటిరెడ్డి.. ఆ పదవిని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి కట్టబెట్టడంతో కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక త్వరలోనే ఆయన కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరానున్నారని టి‌ఎస్ పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరిగింది. కానీ అప్పుడు కోమటిరెడ్డి ఈ వార్తలపై ఏవిధంగానూ స్పందించలేదు..

ఇక తాజాగా ఆయన మీడియాతో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ ను విడబోతున్నట్లు స్పష్టం చేశారు. అంతే కాకుండా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఎన్నో రోజులుగా కోమటిరెడ్డి చుట్టూ దొబుచులాడుతున్న రాజకీయానికి తెరపడినట్లైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నిక ఖాయమైంది. ఇక ఉపఎన్నికల్లో కోమటిరెడ్డి రాజాగోపాల్ రెడ్డి బీజేపీ తరుపున బరిలోకి దిగనున్నారు. గతకొన్నాళ్లుగా మునుగోడు నియోజిక వర్గాన్ని కాంగ్రెస్ కు కంచుకోటగా మార్చారు కోమటిరెడ్డి రాజాగోపాల్ రెడ్డి. ఇప్పుడు ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనుండడంతో మునుగోడు ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

అయితే మునుగోడు నియోజిక వర్గంలో టి‌ఆర్‌ఎస్ కు పెద్దగా పట్టులేదు. ఇప్పుడు ఉపఎన్నికలు రానుండడంతో మునుగోడుపై పట్టు సాధించాలని కే‌సి‌ఆర్ వ్యూహాలు రచించే అవకాశం ఉంది. ఇక ఇప్పటివరకు జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఇక రాబోయే మునుగోడు ఉపఎన్నికల్లో కూడా కోమటిరెడ్డి రాజాగోపాల్ రెడ్డి ప్రభావంతో బీజేపీ ముందంజ వేసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికి కోమటిరెడ్డి రాజాగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించి ఉపఎన్నికలు వచ్చే విధంగా ప్రణాళికలు రచించిన బీజేపీ అధిష్టానం..మరి మునుగోడు ఉపఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -