Monday, May 5, 2025
- Advertisement -

బాబు న‌మ్మించి గొంతు కోశాడు.. మాజీ మంత్రి ఆవేద‌న‌….

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా మ‌రో షాక్ త‌గిలింది. మ‌రో సారి అధికారంలోకి రావాల‌ని బాబు నానా పాట్లు పుడుతుంటె కీల‌క స‌మ‌యాల్లో కీల‌క నేత‌లు పార్టీని వీడుతున్నారు. టికెట్ల కేటాయింపు బాబుకు త‌ల‌నొప్పిగా మారింది. టికెట్ అశించి ద‌క్క‌ని వారు వైసీపీ లోకి వ‌ల‌స వెల్తున్నారు. నరసాపురం టికెట్ ఇవ్వకపోవడంలో ఇప్పటికే అలకపాన్పు ఎక్కిన నేత , మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీకి రాజీనామా చేసి బాబుకు షాక్ ఇచ్చారు.

తన అభిమానులు, మద్దతుదారుల సమక్షంలో రాజీనామా పత్రాలపై సంతకం చేశారు. అనంత‌రం బాబుపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. టికెట్ ఇస్తాన‌ని బాబు న‌మ్మించి మోసం చేశార‌ని కొత్త‌ప‌ల్లి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అందుకే వైసీపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.టికెట్ తనకు ఇవ్వకపోయిన ఫరవాలేదనీ, కానీ తనను సంప్రదించకుండా నరసాపురం టికెట్ ను మరొకరికి కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

కొత్త ప‌ల్లితో పాటు 10 మంది కౌన్సిలర్లు, వేలాది మంది కార్యకర్తలు ఈరోజు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతాం. మా సత్తా ఏంటో చూపిస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ సీఎం అవ‌డం ఖాయమ‌న్నారు. నర్సాపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్‌ రాజును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాన‌ని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -