Friday, April 19, 2024
- Advertisement -

అల్లుడు హరీష్ రావుకు కేసీఆర్ అందలం..

- Advertisement -

కేసీఆర్ తన కేబినెట్ లో అల్లుడు హరీష్, కొడుకు కేటీఆర్ లకు కీలక శాఖలు అప్పగించబోతుండడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ తొలి మహిళా గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ ప్రమాణం కొద్దిసేపటి క్రితమే పూర్తయ్యింది. ఈసాయంత్రమే కొత్త మంత్రివర్గాన్ని కేసీఆర్ విస్తరించబోతున్నారు.

ఈ నేపథ్యంలో అందరూ ఊహాగానాలకు చెక్ చెబుతూ కేసీఆర్ కేబినెట్ లోకి హరీష్ రావును తీసుకుంటుండడం విశేషంగా మారింది. హరీష్ ను మంత్రిగా చేయరనే ప్రచారం ఉదృతంగా సాగడం.. హరీష్ ను కేసీఆర్ దూరం పెట్టారన్న వార్తలు తెలంగాణ రాష్ట్రసమితితోపాటు ప్రజల్లో హరీష్ పై సానుభూతి వెల్లువెత్తింది. అందుకే ప్రతిపక్షాలు, ప్రజల్లో ఆ అపవాదును చెదరగొట్టడానికే హరీష్ రావును కేబినెట్ లోకి తీసుకుంటుండడం విశేషం.

ఇక కేటీఆర్ కు పాత శాఖలనే కేసీఆర్ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. పంచాయతీరాజ్, ఐటీ, మున్సిపల్ శాఖలను కేటీఆర్ కు ఇవ్వబోతున్నట్టు సమాచారం.

ఇక హరీష్ కు ఈసారి ప్రమోషన్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. భారీ నీటి పారుదల శాఖతోపాటు కీలకమైన ఆర్థికశాఖను అల్లుడికి కేసీఆర్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆర్థికమాంద్యం.. తెలంగాణకు నిధుల కొరత.. ఆర్థిక పొదుపు చేయాల్సిన దృష్ట్యానే చురుకైన హరీష్ రావునే ఆర్థికమంత్రిగా కేసీఆర్ చేయబోతున్నట్టు సమాచారం. నీటి పారుదల శాఖమంత్రిగా ప్రాజెక్టులను పరుగులు పెట్టించిన హరీష్ రావు అయితే ఆర్థికమంత్రిగా తెలంగాణ బడ్జెట్ ను స్థిరీకరిస్తారనే నమ్మకంతోనే హరీష్ కు కీలక బాధ్యతలను కేసీఆర్ అప్పగించబోతున్నట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -