ఆరు గ్యారెంటీల అమలును పక్కదారి పట్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాచారంలోని పెద్ద చెరువు ఎస్టీపీని సందర్శించిన అనంతరం మాట్లాడిన కేటీఆర్..ఆరు గ్యారెంటీలను పక్కనబెట్టి మూసీకి లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
మూసీ సుందరీకరణ కేవలం 1100 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్లు మూసీకి తీసుకువస్తే పూర్తి అవుతుంది. కానీ ఈ ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయలు చెబుతూ అవినీతి కోసం కుట్ర చేస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ మూసీకి వ్యతిరేకం కాదు. కానీ మూసీ ప్రాజెక్టు పేరు చెప్పి లక్షన్నర కోట్ల రూపాయల అవినీతి చేస్తామంటే ఊరుకోం అన్నారు.
హైదరాబాద్ నగర ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. పేదల ఇంటి పైకి బుల్ డోజర్లు వస్తే, నాతో సహా పార్టీ నాయకులందరూ ముందు పడతారు అన్నారు.హైదరాబాద్ నగర ప్రజలు కాంగ్రెస్‌కి ఓటు వేయలేరన్న కక్షతోనే రేవంత్ రెడ్డి ఈ విధ్వంసం చేస్తున్నారు అన్నారు. హైదరాబాద్ నగర మూరికినీటి శుద్ధికరణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం…మూసీ నదిలో మూరికినీటి రాకుండా ఎస్టిపిల నిర్మాణం చేపట్టాం అని తెలిపారు. మూసీలో స్వచ్ఛమైన తాగునీరు పోసేందుకు గత ప్రభుత్వమే ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిందన్నారు.