వైసీపీ పార్టీ పెట్టిన దగ్గర నుండి పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకులలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకరు. మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు ఎంపీగా వైసీపీ పార్టీ నుండి గెలిచారు. మేకపాటి పార్టీ మారతారని అప్పట్లో వార్తలు వచ్చిన ఈయన మాత్రం పార్టీ మారలేదు. అయితే వచ్చే ఎన్నికలలో మేకపాటి పోటీ చేయడం అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషుకులు.
ఆయన రాజకీయల నుండి రిటైరవుతారనే మాటలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ప్రత్యేకహోదా కోసం రాజీనామా చేసిన మేకపాటి ఉప ఎన్నికలు వస్తే తప్ప .. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పోటీ చేయకుడదనే భావిస్తున్నారని సమాచారం. మేకపాటి రాజకీయల నుండి తప్పుకుని ఆయన కొడుకుని వచ్చే ఎలెక్షన్స్‌లో నెల్లూరు ఎంపీగా వైసీపీ అభ్యర్థిగా దింపాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మేకపాటి తనయుడు గౌతమ్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గౌతమ్ రెడ్డిని ఎంపీగా పోటీ చేయించాలనేది మేకపాటి వ్యూహంగా వార్తలు వస్తున్నాయి.
మరి మేకపాటి నిర్ణయాన్ని జగన్ ఎలా తీసుకుంటాడో తెలియాల్సి ఉంది. నెల్లూరులో వైసీపీ పార్టీ బలంగానే ఉంది. 2019 ఎలెక్షన్స్‌లో ఎట్టి పరిస్థితులలో జగన్ సీఎం కావాలని పట్టుదలతో ఉన్నాడు. మరి ఇలాంటి సమయంలో మేకపాటి రాజకీయల నుండి తప్పుకుంటే వైసీపీకి పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు.