Tuesday, May 6, 2025
- Advertisement -

ప్ర‌జ‌ల్లో ప‌వ‌న్ విశ్వాసాన్ని కోల్పోయారు: మంత్రి నారాయ‌ణ‌

- Advertisement -

టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య రోజురోజుకీ మాట‌ల వార్ కొన‌సాగుతోంది. కొద్ది రోజుల‌నుంచి ఇరు పార్టీల నాయ‌కులు మాట‌ల తూటాలు పేల్చుకుంటున్నారు. లోకేష్‌పై ప‌వ‌న్ చేసిన అవినీతి ఆరోప‌ల‌నుంచి ఇద్ద‌రి మ‌ధ్య చెడింది. తాజాగా మంత్రి నారాయ‌ణ‌కూడా స్పందించారు.

ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై నారాయ‌ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రజల్లో పవన్ కల్యాణ్ విశ్వాసం కోల్పోయారని అన్నారు. నారా లోకేశ్ పై నిరాధార ఆరోపణలు చేసిన పవన్, లోకేశ్ గురించి తనకు ఎవరో చెప్పారని, తనకు కల వచ్చిందని అంటున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో పోరాడుతుంటే పవన్ కల్యాణ్ విజయవాడలో కూర్చున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు మోదీ తిరుపతిలో ప్రకటించిన విషయం పవన్ కు తెలియదా? ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని మోదీ చెప్పలేదా? ఈ విషయాలన్నీ పవన్ కల్యాణ్ కు తెలియవా? అని ప్రశ్నించారు. విమ‌ర్శ‌లు ఇంకా ఎలాంటి స్థాయికి వెల్తాయో అన్న‌ది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -