Friday, April 19, 2024
- Advertisement -

మా హక్కులను కాలరాస్తారా? కోర్టు కెళ్లిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు

- Advertisement -

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్​ను ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్​ జడ్జి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కరోనా వ్యాక్సినేషన్​ కొనసాగుతున్నందున ఎన్నికలు నిర్వహించలేమంటూ ప్రభుత్వం మొత్తుకుంటున్నా.. అప్పటి ఎన్నికల కమిషనర్​ నిమ్మగడ్డ రమేశ్​ ఎన్నికలు నిర్వహణకే మొగ్గు చూపాడు.

అప్పుడు ప్రభుత్వం కోర్టుకెళ్లినా ఎస్​ఈసీ నిర్ణయమే ఫైనల్​ అంటూ కోర్టులు తెలిపాయి. కానీ ప్రస్తుతం ఎన్నికల సంఘం నిర్వహించిన ఎలక్షన్స్​ రద్దు చేయాలంటూ కోర్టులు తీర్పు చెప్పడం వివాదంగా మారింది. ఇదిలా ఉంటే సింగిల్​ జడ్జి ఇచ్చిన తీర్పులు తమ హక్కులను కాలరాసాలే ఉన్నాయంటూ ఆ ఎన్నికల్లో పోటీచేసిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు.

కృష్ణాజిల్లాకు చెందిన జొన్నల రామ్మోహనరెడ్డి, వేమూరి సురేశ్, భీమవరపు శ్రీలక్ష్మి, మండవ దేదీప్య, బేబీ షాలిని తదితరులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. ఈ వ్యాజ్యాలను కూడా ఈ నెల 27న విచారణకు రానున్న ఎస్‌ఈసీ అప్పీల్‌తో జతచేస్తున్నట్లు తెలిపింది.

Also Read: గర్భిణులు వ్యాక్సిన్​ వేయించుకోవచ్చా? 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -