రాష్ట్ర విభజన జరిగి దాదాపు నాలుగు సంత్సరాలు అవుతున్నా విభజన బిల్లులో ఉన్న హామీలు మాత్రం నెరవేరడంలేదు. ఆదిశగా ప్రస్తుతం ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేయడంలేదన్నది తెలుస్తోంది. ఏపీ అభివృద్దిచెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని 2014 ఎన్నికల్లో బాబు డంకాబజాయించి ప్రజలకు చెప్పారు. విభజన బిల్లులో ప్రధానంగా ప్రత్యేకహోదా, రైల్వేడివిజన్, పోలవరం ఇతర హామీలు ఉన్నాయి. వాటన్నింటిని నెరవేర్చడంలో బాబు ప్రభుత్వం ఎమాత్రం సఫలం అయ్యిందో అందరికి తెలిసిందే.
స్వలాభం కోసం రాష్ట్రప్రయోజనాలను కేంద్రందగ్గర తాక్టు పెట్టారని రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజలనుంచి విమర్శలు వస్తున్నా బాబు మాత్రం పట్టించుకోవడంలేదు. విభజన బిల్లులో హామీలను సాధించాలని ప్రజలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నా బాబు మాత్రం వాటన్నింటిని పట్టించుకోకుండా నియోజక వర్గాల పెంపుమీద దృష్టి పెట్టారు. ఢిల్లీ వెల్లిన బాబు ప్రధానంగా రాష్ట్రప్రయోజనాలు కాకుండా అసెంబ్లీ సీట్లు పెంపుకోసమేన న్న అనుమానాలు బలపడుతున్నాయి.
నియోజకవర్గాల పునర్విభజనపై ఢిల్లీ నుంచి సానుకూల సంకేతాలున్నాయని తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చుతున్నాయి. మూడున్నరేళ్ళుగా అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలంటూ చంద్రబాబు డిమాండ్ చేస్తున్నవిషయం అందరికీ తెలిసిందే. 175 సీట్లను 225కి పెంచాలంటూ చంద్రబాబు ఇప్పటికి ఓ వందసార్లు కేంద్రాన్ని అడిగుంటారు. ఎందుకంటే, నియోజకవర్గాల సంఖ్య పెరగటం చంద్రబాబుకు చాలా అవసరం. లేకపోతే వచ్చే ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో తిరుగుబాట్లు ఖాయం. వైసిపి నుండి 23 మంది ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయించారు. వారందరికి టికెట్లు ఇవ్వాలంటే నియోజక వర్గాల పెంపు ఖశ్చితంగా తప్పనిసరి.
వలసలను ప్రోత్సహించిన వారికి వారికి టిక్కెట్లు ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పవు. అదే సమయంలో టిడిపి నేతలు కూడా ఫిరాయింపు నియోజకవర్గాల్లో టిక్కెట్లను ఆశిస్తున్నారు. నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి అందరికీ టిక్కెట్లు ఇస్తానంటూ వారిని జో కొడుతున్నారు. రాష్ట్రప్రయోజనాలు గాలికి కొట్టుకు పోయినా పర్వాలేదుగాని బాబు అనుకున్న కోరిక మాత్రం నెరవేరబోతోంది. నియోజక వర్గాల పెంపుమీదున్న పట్టుదలలో కాస్తైనా రాష్ట్ర ప్రయోజనాలమీద చూపిస్తే బాగుంటుందనేది ప్రజల కోరిక.