Wednesday, May 7, 2025
- Advertisement -

చంద్రబాబు – బీజేపీ మధ్యలో పవన్!

- Advertisement -

అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో ఒక్కసారిగా ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి. చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు పవన్. అంతేగాదు బాబును పరామర్శించేందుకు విజయవాడకు చేరుకునేందుకు సర్వవిధాలా ప్రయత్నించారు. ఇక టీడీపీ బంద్‌కు కూడా మద్దతిచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది.

కానీ ప్రస్తుతం పవన్…ఎన్డీయే కూటమిలో ఉన్నారు. అయితే బీజేపీ కూడా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించింది కానీ తర్వాత దూరంగా ఉంటూ వస్తోంది. దీనికి కారణం బాబు అరెస్ట్ కేంద్ర ప్రభుత్వానికి తెలిసే జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇదే ఆరోపణలు చేశాయి. దీంతో ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు పవన్.

ఎందుకంటే ఓ వైపు బీజేపీతో దోస్తి అంటూ చంద్రబాబు హస్తాన్ని అందుకున్నారు పవన్. టీడీపీ,జనసేన మధ్య పొత్తు ఉంటుందని ప్రకటించారు కూడా. అదే టైంలో బీజేపీ కలిసిరావాలని విజ్ఞప్తి కూడా చేశారు. టీడీపీని బీజేపీకి దగ్గర చేసేందుకు చాలా ప్రయత్నించారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ వెనుక మోడీ, అమిత్‌ షాల హస్తం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ,బీజేపీ మధ్య మైత్రి చిగురించే అవకాశం కనిపించడం లేదు. దీంతో పవన్‌కు రాజకీయంగా విషమపరీక్షలా మారింది. బాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం లేదని పవన్ ఎలా నిరూపిస్తారు…? బాబును బీజేపీకి దగ్గర చేసేందుకు ఏం చేస్తారు.. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళతారనేది పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -