Monday, May 5, 2025
- Advertisement -

తప్పు చేస్తున్నారు.. ఎవరినీ వదిలిపెట్టం : చంద్రబాబు

- Advertisement -

పంచాయతీ ఎన్నికల ఫలితాలు వైసిపి పతనానికి నాంది అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. వైసిపి పతనం ఇక్కడినుంచే ప్రారంభమైందని చెప్పారు. 20 నెలల వైసిపి పాలనలో అన్నీ ఉల్లంఘనలే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ దెబ్బతీసే పరిస్థితికి వచ్చారన్న ఆయన.. అమరావతి, పోలవరం, పెట్టుబడులను ధ్వంసం చేశారని మండిపడ్డారు.

ఎన్నికల్లో హింసాకాండ, పెద్దఎత్తున మద్యం, డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఎంత హింస పెట్టినా.. ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారని కార్యకర్తల కృషిని కొనియాడారు.

ఎన్నికల్లో 38.74 శాతం ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చాయని చంద్రబాబు వెల్లడించారు. 94 శాతం గెలుచుకుందంటూ వైసిపి నేతలు గాలికబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు.

తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో ఉందన్న చంద్రబాబు… అరాచకాలు చేసేవారు ఫలితాలను చూసైనా మారాలని హితవు పలికారు. పార్టీ పెడుతున్నామని షర్మిల చెబుతుంటే… ఏ2 మాత్రం లేదంటారా? అని అన్నారు.

Also Read

“క‌ర్ణ‌న్” గా రాబోతున్న ధ‌నుష్

పెద్దిరెడ్డికి పాజిటివ్.. హై కోర్టు తీర్పు బలే..!

సాగర్ లో సీఎం కేసిఆర్ షెడ్యూల్ ఇదే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -