ఈ విషయంలో ఏ ప్రభుత్వం గొప్పాది..?

దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా నిధులు ఎక్కడినుంచి రావాలంటే అది ప్రజలనుంచి.. ప్రజలకోసం ప్రజలనుండి ప్రజనిధులను ఖర్చుపెట్టి ప్రజలకోసం మా పార్టీ చేసిందని అని అన్ని పార్టీ లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది.. ఒక పార్టీ మొదలుపెట్టిన సంక్షేమ పథకాలను మరొక పార్టీ అధికారంలోకి రాగానే తామే ప్రజలకోసం చేశామని చెప్పడంలో ఎలాంటి అర్థం లేదు.. ఎందుకంటే ప్రజల సొమ్ము కాబట్టి..  ఏపిలో అయితే ఈ గొప్పలు చెప్పుకోవడం ఇప్పుడు రోజు రోజు కు ఎక్కువ అవుతుంది..

గతంలో పోలవరం ప్రాజెక్ట్ ను భగీరథ ప్రయత్నంగా తలకెత్తుకుని ఎలాంటి అనుమతులు లేకుండా మొదలు పెట్టారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే అయన స్వర్గస్థులైన తర్వాత ఆ ప్రాజెక్ట్ కు జాతీయ హోదా రావడంతో నిధులు సమకూరాయి.. అయితే అప్పుడు ఆ గొప్పతనం మాదే అని చెప్పుకోవడం మొదలు పెట్టింది టీడీపీ.. ఇక ఇప్పుడు అదే అంశాన్ని గుర్తు చేస్తూ బీజేపీ కూడా యా రోజు పోలవరం కు నిధులు సమకూర్చింది సెంట్రల్ లో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వమే అని చెప్పోకోవడం మొదలుపెడుతుంది.. అసలు మొదలుపెట్టిన పార్టీ సైలెంట్ గానే ఉంది మొదలు పెట్టిన వ్యక్తి కొడుకు కూడా సైలెంట్ గా నే ఉన్నాడు.. అసలు భవిష్యత్ లో అధికారంలోకి వస్తాయో రావో అని తెలీని ఈ పార్టీ లు ఇలా కొట్టుకోవడం జనాలకు నవ్వు తెప్పిస్తుంది.

ఇంకో విషయంలోనూ ప్రతిపక్షాలు జనాలకు వినోదాలను కల్పిస్తున్నారు.. విజయవాడ లో దుర్గమ్మ ఫ్లై ఓవర్ నిర్మాణం ప్రారంభానికి సిద్ధం అయ్యింది. ఇది మా ఘనత అంటే మాదే అంటూ అన్ని పక్షాలు ఇప్పుడు సీన్ లోకి వచ్చేశాయి. యుపిఎ ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టబడి బిజెపి ప్రభుత్వం వచ్చాక వేగంగా నిధులు మంజూరు అయి టిడిపి, వైసిపి ప్రభుత్వాల పర్యవేక్షణలో ఈ వారధి రూపుదాల్చింది. అయితే ఇప్పుడు ఎవరికి వారు తమ క్రెడిట్ గా చాటుకునేందుకు పోటీ పడిపోతున్నారు. జనం డబ్బులతోనే కట్టిన వారధికి సొంత డబ్బులు ఇచ్చి కట్టినట్లు పార్టీలు గొప్పలు పోవడం మాత్రం మానడం లేదు. ఎప్పటికి వీరికి అర్ధం అవుతుందో లేదో కానీ ఈ కీర్తి కండూతి కోసం ఆరాటం ఎప్పటికి పోతుందో అని ప్రజల్లో చర్చ నడుస్తుంది.