Sunday, May 4, 2025
- Advertisement -

ర‌స‌వ‌త్త‌రంగా మారిన మంగ‌ళ‌గిరి రాజ‌కీయం…

- Advertisement -

మంగ‌ళ‌గిరి రాజ‌కీయం ర‌స‌వ్త‌త‌రంగా మారింది. అక్క‌డ దాదాపు ముక్కోణ‌పు పోటీ నెల‌కొంది. అనూహ్యంగా అక్క‌డినుంచి జ‌న‌సేన త‌రుపున అభ్య‌ర్ధిని బ‌రిలోకి దింప‌డంతో అక్క‌డా పోటీపై ఆస‌క్తి నెలకొంది. అయితే ప‌వ‌న్ ఎప్పుడ ఎలా మాట్లాడ‌తాడో అయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు హాట్‌గా మారాయి. తాజాగా మిత్ర‌ప‌క్షం సీపీఐకి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు. పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించిన మంగళగిరి స్థానంలో పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో జనసేన తరఫున చల్లపల్లి శ్రీనివాస్‌ నామినేషన్‌ వేయనున్నారు.

నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజైన ఈరోజు అనూహ్యంగా అభ్యర్థిని ప్రకటించి మిత్రపక్షం సీపీఐని అయోమయంలోకి నెట్టేశారు. ఇప్పటికే ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో ఆ పార్టీ తన అభ్యర్థిగా ముప్పాళ్ల నాగేశ్వరరావును ప్రకటించింది. ఇప్పుడు ఏంచేయాలో మిత్ర‌ప‌క్షానికి అర్థం కావ‌డంలేదు.

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్‌, వైసీపీ నుంచి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి పోటీలో నిల‌బ‌డుతున్నారు. ఇప్పుడు జ‌న‌సేన కూడా పోటీ చేయ‌డంతో అక్క‌డ పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. దీంతో ముక్కోణ‌పు పోటీ నెల‌కొంది. జ‌న‌సేన నిర్ణ‌యంపై మిత్ర‌ప‌క్షం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -