వైసీపీ అధినేత జగన్‌కు జనసేన ఛీఫ్ పవన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. డీసీఐ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు మద్దతు పలికిన పవన్ జగన్‌పపై కూడా ఆరోపనలు చేశారు. ప్రతి సమస్యను తాను ముఖ్యమంత్రి అయ్యాక పరిస్కరిస్తాననే భ్రమ నుంచి బయటకు రావాలని విపక్షనేతకు స్వీట్‌గా చురకలంటించారు.
ప్రస్తుతం జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో తాను ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని చెబుతూ వస్తున్నారు. ఈ విషయంపై టీడీపీతోపాటు మరికొందరు నేతలు విమర్శలు చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన ప్రతిపక్షం అధికారంలోకి వచ్చాక చేస్తానని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు పవన్.
సీఎం అనే భావన నుంచి జగన్ బయటకు రావాలని డిమాండ్ చేశారు. తాను ముఖ్యమంత్రిని అయితేనే సమస్యలను పరిష్కరిస్తామనే భావన నుంచి బయటపడాలని హితబోధ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజల్లోకి రావాలని, ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. ప్రజా సమస్యలపై అధికార పార్టీలను నిలదీసేందుకు తాను సిద్ధమని పవన్ కళ్యాణ్ చెప్పారు. తద్వారా ప్రతిసారి అధికారంలోకి వచ్చాక అనకుండా, సమస్యలపై తనలా స్పందించేందుకు ముందుకు రావాలని సూచించారు.