అధికారపార్టీపై జనసేన అధినేత పవన్ తన పంచ్‌ల వర్షం కురిపించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లా పిచుకల లంక నుంచి సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహం వరకు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా నిర్వహించిన కవాతు అనంతరం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రిపైన ఆయన కొడుకు లోకేష్‌లపై నిప్పులు కురిపించారు.
తనపై వస్తున్న ఆరోపణల నుండి ముఖ్యమంత్రి క్లీన్‌గా బయటకు రావాలన్నారు. చేయాల్సిన తప్పులు చేసి డొంకలో దాక్కొంటే పిడుగుపాటు తప్పదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.కొడుకుకు తండ్రి వారసత్వం రావాలని కోరుకొంటారు. కానీ, లోకేష్‌ను సీఎం చేసేందుకు జనసేన టీడీపీకి మద్దతిచ్చిందా అని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేసినా.. సీఎం కార్యాలయంపై దాడులు చేస్తే తాము అండగా ఉంటామన్నారు. అండమాన్ లో , గుంటూరులో ఐటీ దాడులు జరిగితే టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టడంగా ఎలా అవుతోందని ఆయన ప్రశ్నించారు.
పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయితీ రాజ్ మంత్రి చేశారని లోకేష్ పై నిప్పులు చెరిగారు. లోకేష్ కు ఏం తెలుసునని పవన్ ప్రశ్నించారు.తాను సినీ యాక్టర్ అంటారు.. మరి లోకేష్ కు ఏం తెలుసునని ఆయన ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే తమ సత్తా నిరూపిస్తామని ధీమా .పంచాయతీఎన్నికలునిర్వహించనందువల్లే కేంద్ర నిధులు వెనక్కి వెళ్తున్నాయని విమర్శించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే ఉప సర్పంచ్ లతో కలిసి ఆందోళనకు దిగుతామని పవన్ హెచ్చరించారు..