Saturday, May 3, 2025
- Advertisement -

వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమే!

- Advertisement -

వక్ఫ్‌ చట్టం రాజ్యాంగ విరుద్దమేనని సుప్రీం కోర్టును ఆశ్రయించింది వైసీపీ. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్నినాని… వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం..టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించారు అన్నారు.

వక్ఫ్ స్థలాల్లో సాక్షి ఆఫీసులు ఉన్నాయంటూ మొదట ఆరోపణలు చేశారు. సాక్షి స్థలాల లింకు డాక్యుమెంట్లు బయట పెట్టడంతో నోరు మూసుకున్నారు. తర్వాత వైసీపీ విప్ జారీ చేయలేదంటూ ఆరోపణలు చేశారు..విప్ కాగితాలు బయట పెట్టగానే మళ్ళీ నోరు మూసుకున్నారు. ముస్లింల ఆందోళనల్లో సిగ్గు లేకుండా టీడీపీ పాల్లొంటోంది. చంద్రబాబు బొమ్మను దేశ వ్యాప్తంగా ముస్లింలు చెప్పుతో కొడుతున్నారు..అయినా సరే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళితులపై సీఎం చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు. ఎంత మంది దళిత నాయకులను అసెంబ్లీకి పంపాడో చంద్రబాబు చెప్పాలి అని… దళిత మహిళను హోం మంత్రిని చేశారు జగన్..చంద్రబాబు కేవలం ఇద్దరికే మంత్రి పదవి ఇస్తే…ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చారు అని గుర్తు చేశారు.

ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు నోటికొచ్చిన హామీలు ఇచ్చారని ఇప్పుడు ప్రజలను, ఆ హామీలను గాలికి వదిలేశారని మండిపడ్డారు మాజీ ఎంపీ నందిగం సురేష్. ఐదేళ్లూ తన కార్యకర్తలు తానూ సంపాదించుకుని…మళ్లీ ఎలక్షన్లో ఆ సంపద వాడతాడు. జగన్‌ మోహన్ రెడ్డి మాత్రం ప్రజలకు ఏదన్నా చేయాలని భావిస్తారు. రోజూ అంబేద్కర్ విగ్రహాన్ని చూడలేకే ఉన్మాదంతో స్మృతివనంపై దాడి చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -