మోడీ మోనార్క్ వైఖరి ప్రదర్శిస్తున్నాడా ?

బీజేపీలో మోడీ వైఖరి మోనార్క్ లా ఉందా ? బీజేపీ లోని సీనియర్లకు మోడీ – అమిత్ షా ద్వయం షాక్ ఇస్తున్నారా ? భవిష్యత్ అంత బీజేపీ మోడీ నాయకత్వంలోనే నడవనుందా ? అంటే అవుననే సమాధానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలు తెరపైకి రావడానికి కూడా కారణం లేకపోలేదు. ఈ మద్య కాలంలో మోడీ- అమిత్ షా ద్వయం బీజేపీలోని సీనియర్లను మెల్లగా పార్టీ సంస్థాగత నిర్ణయాలకు దూరం చేస్తున్నారు. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే తాజాగా బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ లో బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరికి స్థానం కల్పించకపోవడమే ఇందుకు ఉదాహరణ.

గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా కొనసాగారు నితిన్ గడ్కరి.. సాధారణంగా బీజేపీలో మాజీ అధ్యక్షులను పార్టీ నిర్ణయాత్మక ప్రణాళిక మండలిలో గౌరవ స్థానాలలో ఉంచడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. కానీ నితిన్ గడ్కరి విషయంలో మాత్రం వేటు వేసింది మోడీ- అమిత్ షా ద్వయం. ప్రస్తుతం ఇదే జాతీయ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలంగా మోడీ పరిపాలన విధానంపై అసహనం ప్రదర్శిస్తున్నారు నితిన్ గడ్కరి. ఈ నేపథ్యంలో గడ్కరిని పార్టీకే దూరం చేసే విధంగా బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యత్వాన్ని రద్దు చేసింది మోడీ-అమిత్ షా ద్వయం. నితిన్ మొదటి నుంచి కూడా బలమైన నేతగానే కొనసాగుతూ వస్తున్నారు. ఆర్ఎస్ఎస్ తో కూడా గడ్కరికి మంచి సంబంధలే ఉన్నాయి.

ఇక 2019 ఎన్నికల ముందు మోడీ తరువాత బీజేపీ తరుపున ప్రధాన మంత్రి రేస్ లో గడ్కరి ముందు వరుసలో ఉన్నారు. దీంతో భవిష్యత్ లో బీజేపీ నాయకత్వం పరంగా గడ్కరి.. మోడీకి పోటీలో నిలిచే అవకాశం కూడా లేకపోలేదు. ఇవన్నీ బేరీజు వేసుకొని మోడీకి ఎదురే లేకుండా ఉండకూడదని గడ్కరికి బోర్డ్ సమావేశాల్లో స్థానం కల్పించలేదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఎల్ కె అద్వానీ విషయంలో కూడా మోడీ ఇదే వైఖరి ప్రదర్శించడాని ఉదాహరణగా చెబుతున్నారు. ఇక బీజేపీలోని మరో సీనియర్ నేత వెంకయ్య నాయుడికి కూడా ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి ఆయనను ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేసిన వైనం కూడా తెరపైకి వస్తోంది. ఇవన్నీ పరిశీలిస్తే పార్టీ పరంగా మోడీ కి ఎదురే లేకుండా పక్కా ప్రణాళికలతో సీనియర్లను పార్టీ నుంచి దూరం చేస్తున్నారనే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

Also Read : “ఈ డిమాండ్లు విన్నారా ” .. జగన్ సార్ !

Related Articles

Most Populer

Recent Posts