తెలంగాణాలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. పొత్తులు, కూటమి, అభ్యర్తల ఎంపిక, ప్రచార కార్యక్రమాలపై కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు టీ కాంగ్రెస్ కు చెందిన 40 మంది నేతలు ఢిల్లీ వెల్లిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు గంటల పాటూ జరిగిన ఈ భేటీలో ఎన్నికల వ్యూహాలపై చర్చించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించేందుకు టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలతో పొత్తు కుదుర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అంగీకరించారు. పొత్తు ప్రతిపాదనకు గ్రాన్ సిగ్నల్ ఇవ్వడంతోపాటు పలు కీలక సూచనలు చేశారు రాహుల్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర అంశాలను డీల్ చేసేందుకు ముగ్గురు సభ్యులతో స్క్రీనింగ్ కమిటీని నియమించారు.
పార్టీ సీనియర్ నేత భక్తచరణ్‌దాస్ ఛైర్మన్‌గా జ్యోతిమణి సెంథిమలై, శర్మిష్ట ముఖర్జీతో కమిటీని నియమించారు. వీరు సీట్ల సర్థుబాటు, అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉందని.. పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారట. నేతలకు అభిప్రాయ బేధాలుంటే పార్టీ వేదికగా కూర్చొని చర్చించుకోవాలని.. గెలుపు గుర్రాలనే బరిలోకి దించుదామని చెప్నపారట. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఎవ్వరూ కూడా పొత్తులపై, ఇతర ప్రతిపక్ష నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని రాహుల్ ఆదేశించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి. పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై అధినేత రాహుల్ దిశానిర్దేశం చేశారని.. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. పొత్తుల గురించి నేతలెవరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని రాహుల్ సూచించారని.. రాష్ట్రంలోని పొత్తులపై తుది నిర్ణయం మాత్రం అధిష్ఠానానిదేనమన్నారు.