- ఇక యాదవ నాయకుడు ఎవరో చూడాలి
- తెలంగాణలో ఆసక్తికరంగా రాజ్యసభ ఎన్నికలు
- సభ్యుల ఎంపిక దాదాపు ఖరారు
ప్రస్తుతం కొందరి రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగుస్తుండడంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ నుంచి మూడు స్థానాలు ఖాళీ కానున్నాయి. అయితే ఈ స్థానాలన్నీ టీఆర్ఎస్ పార్టీకే దక్కే అవకాశం ఉంది. దీంతో టీఆర్ఎస్‌లో ఎన్నికల సందడి వచ్చింది. కీలకమైన రాజ్యసభ స్థానాలు కావడం.. 2019లో ఎన్నికలు వస్తుండడంతో ఎక్కడా వివాదాలు లేకుండా సామరస్యంగా రాజ్యసభ సభ్యుల ఎంపిక చేపట్టాలని గులాబీ పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. అయితే ఈ మూడు స్థానాల్లో ఒక్క స్థానం మినహా మిగతా రెండు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారనే చెప్పాలి. వారే సంతోశ్‌కుమార్, నాయిని నర్సింహారెడ్డి.
వీరిద్దరూ కేసీఆర్‌కు వెన్నంటి ఉంటున్నారు. ఉద్యమ సమయంలోనూ, పార్టీ ఏర్పాటు సమయంలోనూ తోడు ఉన్నారు. అయితే వీరిని కేసీఆర్ నిర్ణయించారని సమాచారం. కేసీఆర్ ఎంపిక చేశారంటే ఎవరూ నోరు మెదపలేని ముచ్చట. ప్రస్తుతం కేసీఆర్ ఆ ఇద్దర్ని ఎంపిక చేయడంతో వారిద్దరూ ఎవరూ అని ప్రజలకు ఆసక్తికరంగా ఉంది. అయితే నాయిని నర్సింహారెడ్డి తెలిసిందే. ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌లో కేసీఆర్ వెంట ఉన్న ఒకే ఒక్క నాయకుడు నాయిని. నాయినీని ప్రస్తుతం ఎమ్మెల్సీని చేసి హోంమంత్రిని చేసి గౌరవించుకున్నారు.ఇక రెండో వ్యక్తి సంతోశ్‌కుమార్. ఈ వ్యక్తి ప్రజలకు అంతగా తెలియకపోగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్తకర్తలకు అందరికీ సుపరిచతమే.
తోశ్‌కుమార్. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు రాజకీయ వారసుడిగా సంతోశ్ ఉంటున్నాడు. సంతోశ్ పార్టీ కార్యక్రమాలతోనే కాక బంధువు కూడా కేసీఆర్ వదిన కుమారుడు సంతోశ్. సంతోశ్ కేసీఆర్‌కు ఎప్పటినుంచో తెలుసు. కేంద్రమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఢిల్లీలో కేసీఆర్‌కు వ్యక్తిగత సహాయకుడిగా సేవలు అందించాడు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో వెన్నంటి ఉన్నాడు. టీఆర్ఎస్ వ్యవస్థాపనలో కీలక పాత్ర పోషించాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఆయన కేసీఆర్ వెంటనే ఉన్నారు. అదే సమయంలో ఎలాంటి పదవి ఆశించలేదు. పైగా ఇటు పార్టీ పరంగా అటు ప్రభుత్వ పరంగా ఆయన ముఖ్య సమన్వయ కర్తగా ఇటీవలి కాలంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంతోష్ పేరును రాజ్యసభ కోసం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మార్చి మొదటివారంలో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రకటన ప్రకారం టీఆర్ఎస్ ఖాతాలో మూడు ఎంపీ స్థానాలు దక్కుతాయి. ఇప్పటికే యాదవ నేతకు ఓ సీటు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరో రెండు స్థానాలపై చర్చ జరుగుతుండగా ఇందులో ప్రధానంగా సంతోశ్ పేరు దాదాపు ఖరారైంది. ఇక మిగిలిన ఒక సీటులో ప్రస్తుత హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని పంపే అవకాశం ఉంది. ఈ విషయంలో త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.