Wednesday, May 7, 2025
- Advertisement -

షర్మిలకు ఖచ్చితంగా రోజు ఇవి ఉండాల్సిందే

- Advertisement -

ఏపీ దిగవంత సీఎం వై.యస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా.. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వై.యస్ జగన్ చెల్లెలుగా.. ఒకప్పుడు వైసీపీని ముందు ఉండి నడిపించిన నాయకురాలిగా షర్మిల చాలా మందికి తెలుసు. ఇప్పుడు షర్మిల కాస్త రాజకీయాలకు దూరంగా ఉంటుంది. అయితే షర్మిల లైఫ్ కు సంబంధించిన విషయాలు చాలా మందికి తెలియదు. రాజశేఖర్ రెడ్డి కూతురుగా లైఫ్ ఎంజాయ్ చేసిన ఆమె.. అనుకోని విధంగా రాజకీయ తెరపైకి వచ్చారు.

జగన్ అరెస్ట్ కావడంతో వైసీపీ తరుఫున ఎన్నికల ప్రచారంలో దిగిన షర్మిల రాజశేఖర్ రెడ్డి స్టైల్ లోనే ఓటర్లను ఆకర్షించి వైసీపీని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. రాజకీయాల్లో ఇప్పటివరకు దాదాపు 3,000 కి.మీ పాదయాత్ర చేసిన షర్మిల.. ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆమెకు ఇరవై ఏళ్లవయస్సు ఉన్న అబ్బాయి ఉన్నాడంటే.. ఎవరు నమ్మలేదు. కానీ అది నిజం. ఇక ఇంతలా ఫిట్ నెస్ మైంటైన్ చేసే షర్మిల డైట్ విషయానికి వస్తే.. ఆమె ఉదయం పూట కాస్త ఎక్కువ ఆహారం తీసుకుంటారు. తనకు ఇష్టమైన ఇడ్లీ, పొంగలిని ఎక్కువగా తీసుకోవడం షర్మిలకు అలవాటు. ఇక ఆమె మధ్యాహ్నం మెనులో నాన్-వెజ్ ఖచ్చితంగా ఉండాలి. హైదరాబాద్ బిర్యానీతో పాటు సీఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడే షర్మిల రాయలసీమ రుచులైన జొన్న సంకటి, తలకూర అంటే ప్రణమిస్తారని ఆమె గురించి తెలిసిన వారు చెప్తుంటారు.

వారానికి నాలుగు నుండి ఐదు రోజులు ఖచ్చితంగా నాన్-వెజ్ తీసుకుంటారు. అయితే డిన్నర్ విషయంలో మాత్రం డైట్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ ఉంటారు. రెండు చపాతీలతో పాటు ఒక కప్పు పెరుగన్నానికి మించి ఆమె రాత్రిపూట అసలు ఎక్కువ ఆహారం తీసుకోరు. ఇలా పర్ ఫెక్ట్ డైట్, రోజు జిమ్ చేయడం, యోగ చేయడం వంటివి రెగ్యులర్ గా చేయడం వల్లే జగన్ కంటే ఫిట్ గా కనిపిస్తూ ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -