నంద్యాల ఉప ఎన్నిక రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. అయితే చంద్రబాబులో అపనమ్మకం పెరిగిపోతోంది. దీంతో సొంతపార్టీనేతలను నమ్మకుండా దూరంగా పెడ్తున్నారు. ఇది బాబుకు పెద్ద దెబ్బే. ప్రచారం ఊపందుకున్న సమయంలో మరో ఎదురు దెబ్బ తగిలింది.
నంద్యాలలో శిల్పా సోదరులకు మంచి పట్టున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీ తరుపున పోటీ చేస్తున్నారు. తమ్ముడు చక్రపాణి మాత్రం టీడీపీలోనె కొనసాగుతన్నారు. అందుకె ఆయనను నంద్యాల ఉప ఎన్నికకు అంటరానివారిగా చూస్తున్నారు పార్టీ నాయకవత్వం.
మంత్రులు,ఎమ్మెల్యేలు,లోకేష్,చంద్రబాబు అందరూ నంద్యాలలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కాని ఎక్కడా కూడా చక్రపాణి కనిపించడంలేదు. అనుమానంతో కావాలనే ఆయనను ఎటువంటి పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా అవమాన పరుస్తున్నారు. దీన్ని తట్టుకోలేక పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారు.
ఇప్పటికె జగన్‌తో సంప్రదింపులు కూడా పూర్తయినట్లు సమాచారం. జగన్ వైసీపీలోకి వచ్చేందుకు గ్రీన్ సిగ్న్ ల్ ఇచ్చారు.శ్రీశైలంనుంచి పోటీ చేసేందుకు పార్టీ అధినేత అంగీకరించినట్లు తెలుస్తోంది.త్వరలోనె జగన్ నంద్యాలలో పర్యటన చేరబోతున్నారు అదే సమయంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -
త్వరలో వైసీపీ కండువా కప్పుకోనున్న నేత…
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -