Sunday, May 4, 2025
- Advertisement -

రాజ‌కీయాల‌నుంచి త‌ప్పుకుంటారా…

- Advertisement -

రాజకీయాలన్నాక గెలుపోటములు సహజం.. అన్నది వెనకటి మాట. ఇప్పుడు ఓటమి అత్యంత తీవ్రమైనది. మళ్ళీ గెలుపు అనే ఆశ చాలామందిలో కనుమరుగైపోతోంది ఓటమి తర్వాత. ఎందుకంటే, ఇప్పుడు రాజకీయాల్లో ధన ప్రభావం ఆ స్థాయిలో వుంటోంది గనుక. టిక్కెట్‌ కొనుక్కోవడం దగ్గర్నుంచి, ఎన్నికల్లో డబ్బు పంపిణీ దాకా అదొక పెద్ద ప్రసహనం.

నంద్యాల ఉపఎన్నిక తర్వాత శిల్పా బ్రదర్స్‌ భవిష్యత్‌ అగమ్యగోచరంగా తయారైంది. ‘ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పనిచేసింది..’ అంటూ నీరసంగా ఓటమిని అంగీకరించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి మొహంలో కన్పించిన ‘నీరసం’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 2014 ఎన్నికల్లో ఈయన, భూమా నాగిరెడ్డిపై ఓటమి చవిచూసిన విషయం విదితమే. ఇప్పుడు అదే కుటుంబంపై మరోమారు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

పోనీ, మూడేళ్ళలో అధికార పార్టీలో వుండడం ద్వారా ఏమన్నా వెనకేసుకున్నారా అదీలేదు. ‘ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వండి..’ అని ఆయన చంద్రబాబుని అడ‌గ‌డం ‘డబ్బుల్లేవ్‌’ అని చంద్రబాబు ఓ అధికారిక కార్యక్రమంలో శిల్పా మోహన్‌రెడ్డిని చీదరించుకోవడం చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది.

అనారోగ్య కారణాలంటూ శిల్పా మోహన్‌రెడ్డి ఓటమిపై ఏదో చెప్పాలి కాబట్టి చెప్పేశారు. శిల్పా మోహన్‌రెడ్డి సంగతి సరే, శిల్పా చక్రపాణిరెడ్డి పరిస్థితేంటి.? ఆయన, నంద్యాల ఉపఎన్నిక తర్వాత పూర్తిగా సైలెంటయిపోయారు. బుద్ధిగా టీడీపీలో ఎమ్మెల్సీగా వున్న తనను సోదరుడు నట్టేట్లో ముంచేశాడన్న భావన ఆయనకి కలగకుండా ఎందుకుంటుంది.? పైగా, ఆరేళ్ళ పదవి అంటే ఆషామాషీ విషయమేమీ కాదు.

పౌరుషానికిపోయి ఎమ్మెల్సీ పదవికి శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేసేశారుగానీ, రాజకీయాల పట్ల ఆయన ‘నిబద్ధత’ ఏంటన్నది అందరికీ తెల్సిన విషయమే. ఒక్కటి మాత్రం నిజం, ఓటమి కంటే దారుణమైన దెబ్బ ఆర్థికంగా, రాజకీయంగా శిల్పా బ్రదర్స్‌కి తగిలేసింది. మళ్ళీ రాజకీయంగా పుంజుకోవడం అంత తేలికైన విషయమేమీ కాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -