వివాదాస్పద కామెంట్స్ చేసి ఎప్పుడూ వార్తల్లో నిలచే శ్రీరెడ్డి తాజాగా రూట్ మార్చింది. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లపై చేసిన అనుచిత కామెంట్స్‌కు సంబంధించి ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి విదితమే.
ఈ నేపథ్యంలో తన ఎక్స్ అకౌంట్‌లో ఓ లేఖను పోస్టు చేశారు. ప్లీజ్ అన్నా నన్ను రక్షించమని వేడుకుంటున్నాను అని నారా లోకేష్‌ను శ్రీరెడ్డి కోరారు.తాను టీడీపీకి, టీడీపీ కార్యకర్తలకు, అనుబంధ మీడియా సంస్థకు, జనసేనకు, జనసేన వీరమహిళలకు, వారి కుటుంబ సభ్యులకు ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగిందని అన్నారు.
గత 10 రోజులుగా మీడియయాలో వచ్చే కథనాలు, కథనాల కింద కామెంట్స్, స్పీచ్‌లు, చర్చలు చూసిన తర్వాత తాను ఎంతంది మనోభావాల్ని దెబ్బతిశాననేది తనకు అర్థైందని చెప్పుకొచ్చారు. అయితే టీడీపీ నేతలు మాత్రం శ్రీరెడ్డిని క్షమించేది లేదని తేల్చిచెబుతున్నారు.
https://twitter.com/SriReddyTalks/status/1856861894037889325