- Advertisement -
టీ టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే తెలంగాణాలో టీడీనీ చివరి దశలో ఉంది ఇలాంటి సమయంలో తెలుగు యువత అధ్యక్షుడు తూళ్ల వీరేందర్ గౌడ్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పంపించారు. రాజకీయ అవసరాల కోసం సిద్ధాంతాలకు భిన్నంగా టీడీపీ వ్యవహరిస్తోందని లేఖలో విమర్శించారు.
వీరేందర్ గౌడ్.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ కుమారుడు కావడం గమనార్హం. తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఉప్పల్ నియోజకవర్గం నుంచి మహాకూటమి తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆయన ఈ నెల 3న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.
