తెలంగాణాలో బద్ద శత్రువులుగా ఉన్న పార్టీలు ఇప్పుడు కలసిపోయాయి. రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఊహకందడంలేదు. టీడీపీకి రాజీనామ చేసి కాంగ్రెస్‌లో చేరుతున్న రేవంత్ భవిష్యత్ ఎలాఉంటుందో చెప్పలేని పిరిస్థితి. వాస్తవానికి రేవంత్ టీడీపీని వీడడం వెనక టీఆర్ఎస్‌తో పొత్తు ప్రతిపాదన చంద్రబాబు అండ్ మిగిలిన టీటీడీపీ వర్గాల నుంచి రావడమే ఇందుకు కారణమనె దానిపై చర్చజరుగుతోంది.
చివరి దశలో ఉన్న టీడీపీ వచ్చె ఎన్నికలనాటికి పూర్తిగా కనుమరుగు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకె టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటె కనీసం ఉనికినన్న కాపాడుకోవచ్చనేది టీడీపీ ప్లాన్. పనిలో పనిగా టీఆర్ఎస్‌కు లాబం చేకూరుతుంది. తెలంగాణలో ఇప్పటకీ క్షేత్రస్థాయిలో టీడీపీకి ఎంతోకొంత ఓటు బ్యాంకు ఉంది. ఈ ఓటు బ్యాంకే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేస్తుందన్న ప్లాన్‌తో ఉన్న కేసీఆర్ కూడా టీడీపీతో పొత్తుకు సుముఖంగానే ఉన్నట్లు సమాచారం.
ఇక టీఆర్ఎస్‌తో పొత్తుకు టీడీపీ నుంచి నిన్నటి వరకు ఉన్న రేవంత్ అడ్డు పూర్తిగా తొలగిపోవడంతో ఇక పార్టీలో మిగిలిన మోత్కుపల్లి, రమణ లాంటి వాళ్లు మాత్రమే ఉన్నారు. వీరు పొత్తుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో రెడ్లందరు రెడ్లు అందరూ పార్టీలకు అతీతంగా ఒక్కటి అవుతోన్న విషయాన్ని గ్రహించిన కేసీఆర్ వ్యూహాత్మకంగా తెలంగాణలో బలంగా ఉన్న కమ్మలను పూర్తిగా తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
టీడీపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి 12 అసెంబ్లీ సీట్లతో పాటు ఖమ్మం ఎంపీ సీటు ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ టీడీపీ మరింతగా పట్టుబడితే మరో ఒకటి ఎమ్మెల్యే సీట్లు పెంచడంతో పాటు మల్కాజ్‌గిరి ఎంపీ సీటు కూడా ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సమయానికి షీట్లపంపకాల్లో ఇంకా మార్పులు చేర్పులు చోటుచేసుకొనే అవకాశాలు లేకపోలేదు.