త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ను ఓడించడాకి బాబు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడంలేదు. ఇప్పటి వరకు చేసిన అన్ని జాతీయ సర్వేల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని తేలింది. దీంతో బాబు ఏం చేయాలో తెలియక జగన్ను దొంగ దెబ్బ కొట్టేందుకు కూడా సిద్దమయ్యారు. రెండో సారి ఆపరేషన్ ఆకర్శ వికటించడంతో ఇప్పుడు మరో కొత్త దారి ఎంచుకున్నారు. ఎన్నికల సమయానికి జగన్ ఇమేజ్‌ను తగ్గించడానికి బాబు పడుతున్న పాట్లా అన్నీ ఇన్నీ కావు.
జగన్‌ను ఫేస్‌టుఫేస్ ఢీకొట్టే ధైర్యం లేకపోవడంతో ఇప్పుడు దొంగదారిని ఎంచుకున్నారన్న వార్తలు పార్టీ వర్గాలనుంచి వినిపిస్తున్నాయి. వైసీపీలో టీడీపీ కోవర్టు ఉన్నారనే వార్త ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం సృస్టిస్తోంది. పార్టీలో జరిగే అంతర్గత వ్యవహారాలు సదరు కోవర్టు ద్వారా బాబుకు చేరవేస్తున్నారంట. ఇప్పుడు ఇదే వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.
పార్టీ నిర్వహిస్తున్న అంతర్గత సమావేశాల్లో పార్టీకార్యక్రమాల నిర్వహన, అధికారంలోకి వస్తే పార్టీ అమలు చేయనున్న కొత్త పథకాలు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సంబంధించిన వ్యూహాత్మక కార్యక్రమాల వివరాలను కోవర్టు ద్వారా బాబుకు చేరుతున్నాయంట.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి మొదటి వారంలో బిసీ గర్జాన సభను ఏర్పాటు చేయాలని నిర్నయించారంట. ఆ సభలో బీసీల అభివృద్ధికోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో దానికి సంబంధించిన ఓ డిక్లరేషన్‌ను కూడా ప్రకటించాలాని గతంలోనే పార్టీ అంతర్గతంగా జర్చజరింది. దాంతో పాటు కొత్త పధకాలకు సంబందించిన విషయాలు కూడా లీక్ అవుతున్నాయంట. దీనికి ఉదాహరణగా తీసుకుంటే…. జగన్ బీసీ గర్జన సభను నిర్వహించడానికి ముందే…. రాజమండ్రిలో జయహో బిసి సభను నిర్వహించారు. అంతర్గత సమావేశాల్లో జగన్ చర్చించిన పలు ప్రణాళికలు టిడిపికి ఎవరు చేరవేస్తున్నారని పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారంట.
మొదట జగన్ దీని మీద శ్రద్ద చూపించకపోయినా ఇప్పుడు మాత్రం జాగ్రత్త పడుతున్నారంట. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు కాబట్టి కోవర్టులు ఎవరు అనేదానిపై జగన్ గుర్తించే పనిలో ఉన్నారంట. జగన్ జాగ్రత్త పడకపోతే పార్టీకి భానీ నష్టం తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మరి ఆ టీడీపీ కోవర్టులు ఎవరో….?