- Advertisement -
కర్నూలు జిల్లాలో టీడీపీకీ షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, ఏపీ పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్ పాండ్‌లోని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పు జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్మానించారు.
ఇప్పటికే టీడీపీ సభ్యత్వానికి, చైర్మన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లాలో పట్టున్న నేతగా పేరున్న చల్లా రామకృష్ణారెడ్డి గతంలో కోవెలకుంట్ల, బనగానపల్లి నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.