మొన్నటివరకు టీడీపీలోకి వైసీపీ నుంచి ప్రజాప్రతినిధులు చేరితే.. ఇప్పుడు టీడిపీ నుంచి వైసీపీలో చేరుతున్నారు. మంత్రి పదవులు కోల్పోయినవారు, మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్న వారు, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని డిసైడ్ అయిన వారు వైసీపీ వచ్చేందుకు రెడీ అవుతున్నారు. శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీని వీడి వైసీపీలోకి చేరి నంద్యాలలో ఉప ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నిలబడ్డాడు. పార్టీ మారినా తాను మాత్రం టీడీపీలోనే ఉంటానని, చంద్రబాబు తనను ఏకంగా రెండుసార్లు ఎమ్మెల్సీని చేశారని శిల్పా చక్రపాణిరెడ్డి ఎంత మొత్తుకుంటున్నా ఆయన్ను లోకల్ టీడీపీ వాళ్లు, పార్టీ అధిష్టానం ఆయన్ను అస్సలు నమ్మడం లేదు. ఉప ఎన్నిక ప్రచారంలో కూడా ఆయన్ను పక్కన పెట్టేశారు. దీంతో తీవ్ర మనస్థాపంతో ఉన్న ఆయన ఉప ఎన్నికకు ముందుగానే పచ్చ కండువా వదిలేసి వైసీపీలోకి చేరుతున్నాని ప్రకటించాడు. దీంతో ఉప ఎన్నికల్లో టీడీపీకి అతి పెద్ద షాక్ తగులుతుంది. ఇక ఏపీలో కీలకమైన గుంటూరు జిల్లా నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు చంద్రబాబుకే ఇంటిలిజెన్స్ నివేదికలు వెళ్లాయటమాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగకు సాయం చేశారన్న నివేదికలు బాబు వద్దకు చేరడంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వరని తేలిపోయింది. ఈ నెపథ్యంలో ఆయన వైసీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారట. ఇక గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల గత ఎన్నికల్లో రాయపాటి కోసం తన సిట్టింగ్ ఎంపీ సీటును వదులుకుని ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎంపీ సీటును వదులుకున్న ఆయన మంత్రి పదవి ఆశించారు. అయితే బాబు ఆయనకు ప్రక్షాళనలో కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఆయన మాట ఓ ఎమ్మెల్యేగా సొంత నియోజకవర్గంలోనే చెల్లుబాటు కావడం లేదు. మోదుగుల బావ ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి వైసీపీలో ఉన్నారు. దీంతో ఆయన ద్వారా మోదుగుల కూడా వైసీపీలోకి వెళ్లే ఏర్పాట్లలో ఉన్నారట. ఏదేమైనా వీరికి తోడు మరికొందరు వైసీపీలోకి చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
- Advertisement -
వైసీపీలో చెరనున్న ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీ వీరే
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -