Tuesday, May 6, 2025
- Advertisement -

సిఎం ర‌మేష్‌… 2వేల కోట్లు.. ఆ చానెల్ స్టోరీ ఏంటి

- Advertisement -

టీడీపీకి అనుకూల మీడియాగా చెప్పుకునే చానెల్‌లో సిఎమ్ రమేష్ ఎందుకు టార్గెట్ అయ్యాడు. 2 వేల కోట్లు కాంట్రాక్టులు సిఎమ్ రమేష్ ఎలా ఎత్తుకుపోయాడు అంటూ కథనాల మీద కథనాలు ఆ ఛానల్ ఎందుకు వండి వారిస్తుంది. ఇపుడిదే విషయం ప్రతి పక్షం వారికే కాకుండా టీడీపివారికి అర్ధం కాకుండా ఉంది. మా సిఎమ్ రమేష్ ఇంతటి స్కాం చేశాడా అనుకునేలా చెవులు కొరుక్కుంటున్నారు. ఒకవేళ సిఎమ్ రమేష్ ఆ స్థాయిలో ఆమ్యామ్యా చేస్తే చంద్రబాబు ఊరుకుంటాడా చెప్పండి. ఎప్పుడో ఓ నొక్కు నొక్కి ఉండేవాడు. కాని అలా ఏ యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు. ఇక్కడ సరిగా ఆలోచిస్తే సమాధానం దొరికేస్తుంది. కాని సదరు ఛానల్ సిఎమ్ రమేష్ ఒక్కడే తినేశాడనే ప్రయత్నం చేస్తుంది. ఎందుకలా.

ఆంధ్ర ప్రదేశ్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల్లో ప‌లు ఇరిగేష‌న్ కాంట్రాక్ట్‌లు సిఎం ర‌మేష్ కు చెందిన సంస్థ సొంతం చేసుకుంద‌ని ఆ సదరు ఛానల్ వెల్లడించింది. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పి మరీ దాదాపు 2వేల కోట్లకు పైగానే విలువ చేసే కాంట్రాక్టులు ద‌క్కించుకున్న సిఎం ర‌మేష్‌… వాటిని పూర్తి చేయడంలో ఫెయిలయ్యాడని అక్కసును వెల్లగక్కింది. ఎట్ ప్రజెంట్ పోల‌వ‌రం ప్రాజెక్ట్ మీద కూడా ఆయనగారి క‌న్ను ప‌డి పోయిందంటూ ఆరోపించింది.

గత కొన్ని రోజులుగా టీడీపీకి అనుకూల మీడియాగా చెప్పుకునే చానెల్‌లో వ‌చ్చిన ఈ స్టోరీ కాబ‌ట్టి… దీనిపై చ‌ర్చ గట్టిగానే సాగుతుంది. ఐతే ఈ స్టోరీ వెనుక సిఎం ర‌మేష్ అంటే గిట్టని వారు రన్ చేస్తున్నారనే విషయం తెలియంది కాదు. ఇంకో రీజన్ సిఎమ్ రమేష్ డామినేషన్ మరీ ఎక్కువైపోతూ ఉండడంతో కొందరు పనిగట్టుకుని ఇలా చేశారని చెబుతున్నారు. కాని ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం.. సిఎమ్ రమేష్ ప్రతి ప్రోపర్టీలోను బాబుకు వాటాలు ఉన్నాయనేది టీడీపిలో చెపుకునే మాట. అది తెలియకుండా రమేష్ ఒక్కడే అంత తినేస్తే బాబుగారు ఊరుకుంటారా చెప్పండి. కాస్త ఆలోచించండి తమ్ముళ్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -