నన్ను మించిన సీనియర్ నాయకుడు దేశంలోనే లేడు అని తన డప్పు తానే కొట్టుకునే చంద్రబాబు నాయకత్వాన్ని జీరో స్థాయికి తీసుకెళ్ళే పరిణామం అతి త్వరలోనే చోటు చేసుకోనుంది. తన నాయకత్వ లక్షణాల గురించి చాలా గొప్పగా చెప్పుకునే చంద్రబాబుకు టిడిపి ఎమ్మెల్యేనే బిగ్గెస్ట్ షాక్ ఇవ్వనున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను నిలబెట్టుకోవడం, నాయకులంతా చెప్పినట్టు వినేలా చేసుకోవడం పెద్ద విషయమే కాదు. అధికారంలో లేనప్పుడే నాయకుడి స్థాయి ఏంటో తెలుస్తోంది.
ఇప్పుడు అధికారంలో లేని తెలంగాణా టిడిపికి కూడా నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు సామర్థ్యం జీరో స్థాయికి వెళ్ళే రోజు అతి త్వరలోనే రాబోతోంది. ఇప్పటికీ టిడిపి నుంచీ తొంభై శాతం మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. ఇక ఇప్పుడు బిసి సంఘాల అధినేత ఆర్ కృష్ణయ్య కూడా టిడిపిని వీడనున్నాడు. తాాజాగా కెసీఆర్‌పై ప్రశంశల జల్లు కురిపించిన కృష్ణయ్య బిసిల విషయంలో చంద్రబాబు చేస్తున్న అన్యాయం గురించి కూడా పరోక్షంగా సెటైర్స్ వేశాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన వెంటనే టిడిపిని జాతీయ పార్టీగా తనకు తాను ఆర్భాటంగా ప్రకటించుకున్నాడు చంద్రబాబు. ఇప్పటి వరకూ కూడా ఎన్నికల కమిషన్ అనుమతి మాత్రం రాలేదు. అలాగే తాను జాతీయ అధ్యక్షుడిని అని కూడా చెప్పుకున్నాడు. అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో టిడిపిని అథోగతి దిశగా నడిపిస్తున్న చంద్రబాబు అధికారంలో లేని తెలంగాణాలో మాత్రం పూర్తిగా జీరో స్థాయికి తీసుకెళ్ళాడు. అనుభవం లేదు, నాయకత్వలక్షణాలు లేవు అనుక్షణం జగన్‌పై ఆరోపణలు చేస్తూ ఉండే చంద్రబాబు అధికారంలో లేని చోట పార్టీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడన్నది మాత్రం కంటికి కనిపిస్తున్న నిజం అని రాజకీయ విశ్లేషకులు కూడా చంద్రబాబు నాయకత్వ వైఫల్యాన్ని విశ్లేషిస్తున్నారు.