అవును మీరు విన్నది నిజమే. నారా లోకేశ్‌పై పోటీ చేస్తుంది తమన్నా. అయితే సినిమా హీరోయిన్ తమన్నా అనుకుంటున్నారేమో ఆమె కాదు. నారా లోకేశ్‌పై ట్రాన్స్ జెండర్ తమన్నా పోటీ చేస్తుంది. మంగళగిరినుంచి స్వతంత్ర అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ తమన్నా పోటీ చేస్తుంది. మీడియా సమావేశం పెట్టిమరి ఈ విషయాన్ని వెల్లడించింది తమన్నా. ఇప్పటికే నారా లోకేశ్ గెలుపుపై అనేక అనుమానాలు కలుగుతున్న ఈ తరుణంలో ఓ ట్రాన్స్ జెండర్ లోకేశ్‌పై పోటీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మంగళగిరిలో ఇప్పటికే లోకేష్ ప్రత్యర్థి వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.
గత ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. మరోకసారి అక్కడ విజయం సాధించి జగన్‌కు కానుకగా ఇవ్వాలని చూస్తున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇక టీడీపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక్కడ లోకేశ్ ఓడిపోతే పరువు పోతుందని, ఎంత ఖర్చుపెట్టి అయిన సరే లోకేశ్‌ను గెలుపించుకోవాలని భావిస్తుంది టీడీపీ అధిష్టానం. ఇంతలోనే ఓ ట్రాన్స్ జెండర్ లోకేశ్‌పై పోటీకి దిగడంతో అందరు దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో అన్ని తప్పులు మాట్లాడుతున్న లోకేశ్‌కు తమన్నా పెద్ద తల నొప్పిగా మారింది.

నారా లోకేష్ టంగ్ స్లప్‌తో తరుచూ వార్తల్లో నిలుస్తున్న మంగళగిరిలో చర్చనీయాంశంగా మారింది. అసలు లోకేశ్‌కు తమన్నాకు వచ్చిన ఓట్లన్ని కూడా వస్తాయో లేదో అని వైసీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల సభల్లో ఏరేంజ్‌లో తన ప్రసంగాలపై జోకులు పేల్చబోతున్నాడో అని టీడీపీ శ్రేణులు వణికిపోతున్నాయట. ట్రాన్స్ జెంటర్ తమన్నా ఈ రోజు ఉదయం 11:30 గంటలకు మంగళగిరిలో నామినేషన్ వేసింది. ఈ పరిణామం వైసీపీ శ్రేణుల కంటే టీడీపీకే ఎక్కువ నష్టం కలిగించేలా ఉందని అక్కడి వారు చర్చించుకుంటున్నారు.