Thursday, April 25, 2024
- Advertisement -

మోదీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..పీఎం-కేర్స్‌ లో లొసుగులు..!

- Advertisement -

కరోనా సహా అత్యవసర పరిస్ధితులు తలెత్తినప్పుడు సహాయం చేసేందుకు ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్‌ పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతూ.. దేశంలోని 100మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్​ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. పీఎం-కేర్స్‌ లబ్దిదారులు, ఖర్చులకు సంబంధించిన ఆర్థిక వివరాలను.. ప్రజా జవాబుదారీ ప్రమాణాలను అనుసరిస్తూ బయటపెట్టాల్సిన అవసరం ఉందని వారు ఈ లేఖలో పేర్కొన్నారు.

పీఎం-కేర్స్‌పై జరుగుతున్న చర్చను నిశితంగా గమనిస్తున్నామని తెలిపిన మాజీ ఐఏఎస్​ అధికారులు… దాని నిర్వహణలో జవాబు లేని అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయని అన్నారు. ప్రధానమంత్రి హోదాకు భంగం వాటిల్లరాదంటే.. ఆయనతో ముడిపడిన అన్ని అంశాల్లోనూ పూర్తి పారదర్శకత ఉండాల్సిన అవనసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -