2019 ఎన్నికలు ఏపీలో వైసీపీ ,టీడీపీ రెండు పార్టీలకు ప్రతీష్టాత్మకమే. రెండు పార్టీలు గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే జనసేన అధినేత మాత్రం పానకంలో పుడకలాగా తయారయ్యాడు. పవన్ ఒంటరిగా పోటీచేయడు…కాని బాబకు మాత్రం మద్దుతు తెలపడంఖాయం.దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం వైసిపి అధినేత చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ తో పోరాటం చేయక తప్పేట్లు లేదు. గడిచిన మూడు రోజులుగా పవన్ జగన్‌నే టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికల్లో జనసేన ఎవరితోనూ పొత్తు పెట్టుకోదంటూ స్పష్టంగా ప్రకటించినా ఎవరికీ నమ్మకం కుదరటం లేదు. అడుగడుగునా పవన్, చంద్రబాబును వెనకేసుకు రావటంతోనే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం బాబు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాజధాని నిర్మానం, అవినీతి ఆరోపనలు, పోలవరం తదితర సమస్యలపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. ఇటువంటి పరిస్ధితుల్లో వచ్చే ఎన్నికల్లో అధికారం నిలుపుకోవటమన్నది చంద్రబాబుకూ చాలా అవసరం. అందుకు పవన్ ను తురుపుముక్కగా వాడుకోవాలని చంద్రబాబు భావించినట్లున్నారు.
నిజానికి వచ్చే ఎన్నికలు ఇటు చంద్రబాబు అటు జగన్ ఇద్దరికీ చాలా కీలకం. అధికారాన్ని అందుకోవటానికి జగన్ ఎంత అవస్తలు పడుతున్నారో, అధికారాన్ని నిలుపుకోవటానికి చంద్రబాబు అంతకన్నా ఎక్కువే అవస్తలు పడుతున్నారు. మూడున్నరేళ్ళల్లో అనేక సమస్యలపై వైసిపి అసెంబ్లీ వేదికగా చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసింది. అంతేకాకుండా ప్రతీ అంశంలోనూ వైసిపి ప్రభుత్వాన్ని దుమ్ము దులిపేస్తోంది. కనీ పవన్‌కు ఇవన్నీ కనిపించడంలేదు.
రాష్ట్రంలో సమస్యలు పెరుగిపోతున్నాయంటే చంద్రబాబును నిలదీయాల్సింది పోయి విచిత్రంగా జగన్నే తప్పుపడుతున్నారు పవన్. పరిస్ధితులు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్ళీ చంద్రబాబు, పవన్, భాజాపాను కూడా ఎదుర్కోక తప్పేట్లు లేదు. ఒకవేళ పవన్ ఒంటరిగా ఎన్నికల్లోకి దిగినా అది జగన్ ను దెబ్బ కొట్టటానికే అవుతుంది కానీ మరోటి కాబోదు. ఇద్దరి టార్గెట్ జగన్‌కు దెబ్బకొట్టడమే అనేది స్పష్టంగా అర్థ మవుతోంది.
గతంలో ప్రజారాజ్యం పార్టీని సర్వనాశనం చేసిన వాల్లని వదిలిపెట్టనని పవన్ ప్రకటించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం, టీడీపీని మట్టికరిపించి వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే పవన్ వచ్చే ఎన్నికల్లో జగన్‌ను అధికారానికి దూరం చేయడం తప్ప మరోకటికాదనేది తెలుస్తోంది. బాబు, పవన్ బాగోతాన్ని ప్రజలల్లో వైసీపీ ఏమేర తీసుకెల్తాదో దానిపైనే అదారపడింది జగన్ భవిష్యత్తు.