Sunday, May 4, 2025
- Advertisement -

బి‌ఆర్‌ఎస్ ప్రస్థానం మొదలు.. వాట్ నెక్స్ట్ కే‌సి‌ఆర్ ?

- Advertisement -

ఇక తెలంగాణలో టి‌ఆర్‌ఎస్ ప్రస్థానం ముగిసి బి‌ఆర్‌ఎస్ గా మార్పు చెంది జాతీయ ప్రస్థానం మొదలైంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కే‌సి‌ఆర్ ఎన్నో రోజులుగా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ లో దసరా రోజున ఆయన జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని అధికారికంగా మొదలు పెట్టారు. 22 ఏళ్లుగా తెలంగాణ ప్రజల్లో చెరిగిపోని ముద్రా వేసిన టి‌ఆర్‌ఎస్ ను బి‌ఆర్‌ఎస్ గా మార్చారు. ఇక తాజాగా పేరు మార్పు పై ఉన్న అభ్యతరాల గడువు పూర్తి కావడంతో నేడు ( డిసెంబర్ 9 ) కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన అధికారిక పత్రాలపై టి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ సంతకాలు చేసి టి‌ఆర్‌ఎస్ ను పూర్తిగా బి‌ఆర్‌ఎస్ గా మార్చారు.

ఇక పై టి‌ఆర్‌ఎస్ పేరు కనిపించదు. బి‌ఆర్‌ఎస్ జెండగా టి‌ఆర్‌ఎస్ జెండానే కొద్దిగా మార్పులు చేసి గులాబీ రంగు మద్యలో భారత దేశ చిత్రపటం ఉంచి మద్యలో కారు గుర్తు ఉంచారు. ఇక ఇప్పటివరకు తెలంగాణ పరిమితం అయిన టి‌ఆర్‌ఎస్ ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ గా దేశ వ్యాప్తంగా విస్తరించనుంది. అయితే ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీలేవీ దేశ వ్యాప్తంగా సత్తా చాటిన దాఖలాలు లేవు. టీడీపీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు చంద్రబాబు, తృణమూల్ కాంగ్రెస్ విషయంలో మమత బెనర్జీ, ఇంకా జనతాదళ్, బిఎస్పీ.. వంటి ప్రాంతీయ పార్టీలన్నీ జాతీయ హోదా కోసం ప్రయత్నించినవే. అయితే ఏవి కూడా జాతీయ స్థాయిలో గుర్హ్తింపు పొందలేక పోయాయి.

ఇక డిల్లీలో మొదలైన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో సైతం పాగా వేసి, తాజాగా జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో 6 శాతం కంటే ఓట్లు నమోదు చేసుకొని ప్రస్తుతం జాతీయ పార్టీ హోదా తెచ్చుకుంది. ఇలా జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి పదేళ్ళ సమయం పట్టింది. ఇక ఇప్పుడిప్పుడే బి‌ఆర్‌ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కే‌సి‌ఆర్ కు ఆ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి ఎన్నాళ్లు సమయం పడుతుందో అనే ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి. మరి కే‌సి‌ఆర్ తన చతురతతో బి‌ఆర్‌ఎస్ ను జాతీయ స్థాయిలో ఎలా బలపరుస్తారు ? ఇకపై నుంచి కే‌సి‌ఆర్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మరి చూడాలి కే‌సి‌ఆర్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతాడో మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -