Monday, May 5, 2025
- Advertisement -

అస‌లు ఉండ‌వ‌ల్లి ఇచ్చిన స‌ల‌హా ఏంటి…? అది పాటిస్తె ప్రజల మదిలో స్థానం సంపాదించుకోవచ్చు..

- Advertisement -

రాజ‌కీయం అన్నాక అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుల మ‌ధ్య విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు స‌ర్వ‌సాధార‌ణం. అవి లేక‌పోతె రాకీయం ర‌క్తి క‌ట్ట‌దు. టీడీపీ అధినేత ఏపీ సీఎం బాబు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ప్ర‌తిప‌క్ష పార్టీ విమ‌ర్శ‌లు చేయ‌డంలో త‌ప్పులేదు గాని అవి శృతి మించ‌కూడ‌ద‌రు. దాని వ‌ల్ల ప్ర‌జ‌ల‌ల్లో కూడా ప్ర‌తిప‌క్ష పార్టీపై ఒకింత వ్య‌తిరేక భావ‌న క‌లుగుతుంది.

బాబుపై వైసీపీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న విమ‌ర్శ‌లు హెచ్చుమీరుతున్నాయ‌నెది వాస్త‌వం. దీన‌మీద ఇత‌ర రాజ‌కీయ‌పార్టీల నాయ‌కుల‌నుంచి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. జ‌గ‌న్‌కు స‌పోర్ట్‌గా ఎప్పుడూ మాట్లాడె కాంగ్రెస్ సీనియ‌ర్‌నేత ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ తాజాగా వైసీపీఅధినేత‌కు విలువైన స‌ల‌హా ఇచ్చారు.

రాజకీయాల్లో సీనియర్ అయిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడి వయసును చూసైనా ప్రతిపక్ష నేత జగన్ గౌరవం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ సలహా ఇచ్చారు. జగన్ గౌరవించడం నేర్చుకుంటే, ప్రజల మదిలో స్థానం సంపాదించుకోవచ్చని అన్నారు. చంద్రబాబు వైఖరి ఎంతో తప్పని, అయినప్పటికీ ఆయనతో పోలిస్తే చాలా తక్కువ వయసున్న జగన్ సంయమనం పాటిస్తేనే మంచిదని సూచించారు.

చంద్రబాబు వంటి పచ్చి అబద్ధాలు చెబుతున్న సీఎంను తాను ఇంతవరకూ చూడలేదన్నారు. డిసెంబర్ నాటికి కూడా పూర్తయ్యే అవకాశం లేని పురుషోత్తపట్నం ప్రాజెక్టును హడావుడిగా పనులు పూర్తికాకుండానే ఆగస్టు 15న జాతికి అంకితం చేశారని విమర్శించారు. పోలవరం పనులు ఏడాదికి 3 శాతం మాత్రమే జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరిట చంద్రబాబు సర్కారు అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. మ‌రి ఉండ‌వ‌ల్లి ఇచ్చిన స‌ల‌హాను జ‌గ‌న్ పాటిస్తారా …?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -