Monday, May 5, 2025
- Advertisement -

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై చెప్పుతో దాడి ….

- Advertisement -

జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ కి ఖమ్మం జిల్లాలో చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. పవన్ కళ్యాణ్ మీదకు విసిరినప్పటికీ ఆ చెప్పు.. వాహనంపై పడింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తపడ్డారు. అనంతరం పవన్‌ తల్లాడ నుంచి ఖమ్మం పట్టణానికి చేరుకున్నారు.

తెలంగాణాలో ప‌వ‌న్ మూడు రోజుల రాజ‌కీయ యాత్ర‌ను క‌రీనంన‌గ‌ర్‌నుంచి ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. యాత్ర‌లో భాగంగా ప‌వ‌న్ ఖ‌మ్మం జిల్లాలోకి ప్ర‌వేశించారు. జిల్లా తల్లాడలో పవన్ టాప్ లెస్ వాహనంలో పర్యటిస్తున్నారు. ఆయన వాహనంలో ప్రయాణిస్తూ.. అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో.. గుర్తు తెలియని వ్యక్తి ఆయన కాన్వాయిపైకి చెప్పు విసిరాడు. అది పవన్ వాహనంపై పడింది. దీంతో వెంటనే తేరుకున్న అభిమానులు తొలగించేశారు. ఇంత జరిగినా.. పవన్ ఎలాంటి ఆగ్రహానికి లోనవ్వకుండా.. చిరునవ్వుతో తన యాత్రను కొనసాగించడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -