నంద్యాల ఉప ఎన్నికను చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనంత ప్రతీష్టాత్మకంగా తీసుకున్నారు.గెలుపే లక్ష్యంగా పాలనను సైతం పక్కనబెట్టి తన పరివారం అంతా నంద్యాలలో తిష్టవేశారు.రాష్ట్ర ప్రభుత్వ పాలనకు రెఫరెండం అనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులకు గెలిచి తీరాల్సిందేనని ఆల్టిమేట్టం ఇచ్చారు.
కర్నూలుకు చెందిన నాయకులకు నామినేటెడ్ పదవుల్లోనూ పెద్ద పీట వేస్తున్నారు. తాజాగా నంద్యాల ఉప పోరు గురించి చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.టీడీపీ శ్రేణులను అమరావతికి పిలిపించిన చంద్రబాబు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. నంద్యాల నియోజకవర్గంలో ఎన్నిక ఏకపక్షంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బాబు పిలుపునిచ్చారు.
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు నంద్యాల ఉపఎన్నిక ఒక పరీక్ష అని ఈ పరీక్షలో ఫస్టు మార్కులు రావాలని చంద్రబాబు ఆదేశించారు. మాజీ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ తెలుగుదేశం పార్టీలో అత్యంత క్రమశిక్షణ కలిగిన నాయకుడు అని క్రమశిక్షణ కలిగిన వారిని పార్టీ ఎప్పటికీ గౌరవిస్తుందని వారి సేవలను గుర్తిస్తుందని చెప్పారు.దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నంద్యాల ఉప ఎన్నిక భయం బాబుకు ఏ రేంజ్‌లో ఉందో .
- Advertisement -
మంత్రులకు అల్టిమేట్టం జారీచేసిన చంద్రబాబు….
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -