మూడు, నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో నానా హడావుడి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ చేశాడు. ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ వచ్చి రచ్చరచ్చ చేశాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడో… పొగుడుతున్నాడో లేడో తెలియదు. కానీ మూడు, నాలుగు నెలలకోసారి వస్తాడు… నానా హంగామా చేసి వెళ్లిపోతాడు. మళ్లీ వస్తాడు.. ఏదేదో తోచింది చంద్రబాబు ప్రభుత్వం రాసిచ్చింది చదువుతాడు వెళ్లిపోతాడు. ప్రతిసారి ఇదే జరుగుతుంది.
అయితే ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తానని ప్రకటించి మరీ వచ్చాడు. ఏపీలో మూడు రోజులు, తెలంగాణలో రెండు రోజులు పర్యటించాలని పక్కా ప్లాన్ ఉంది. దానికనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు ఆ పార్టీ నాయకత్వం లేదా నిర్వాహకులు. అయితే తన పర్యటన అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పవన్ ముగించాడు. ఏపీకి కేటాయించిన మూడు రోజులు దాటి ఐదు రోజులు పర్యటించాడు. ఆ పర్యటన మూడు రోజులకు పక్కా ప్లాన్ ఉండగా మిగతా రెండు రోజులు కూడా కొనసాగించడంతో ఏం కార్యక్రమం నిర్వహించాలనే దానిపై నిర్వాహకులకు వెంటనే తెలియరాలేదు.
అప్పటికప్పుడు ఏం నిర్వహించాలో తెలియక మల్లగుల్లాలు పడి అప్పటికప్పుడు తోచింది చెప్పారు. దాన్ని పవన్ ఆచరణలో పెట్టాడు. గుంటూరులో కార్యకర్తల సమావేశం, పోలవరం పర్యటన అకస్మాత్తుగా చేసిందే. ఎక్కడ క్రేజ్ రాదని భావించడేమో కానీ పవన్ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలు బయటకు చెప్పాడు. పరిటాల రవి గుండు కొట్టించలేదని ఏళ్ల తర్వాత చెప్పాడు. కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలు చేశాడు. దీనికి చంద్రబాబు మీడియా పెద్ద పెద్ద అక్షరాలతో ప్రాచుర్యం కల్పించింది. కానీ వాస్తవంగా పవన్ కల్యాణ్ ఎందుకు వచ్చాడో.. ఎందుకు వెళ్లాడో ప్రజలకు మాత్రం తెలియదు. అదేదో కంపెనీ ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆ సమస్య జాతీయ సమస్యగా భావించి పవన్ వచ్చాడు. చిన్న సమస్యను పట్టుకొని పెద్ద సమస్యగా చేయడం పవన్‌కు, మీడియాకు అలవాటే. అంతకన్నా ప్రజా సమస్యలు, రాష్ట్ర సమస్యలు ఉన్నా పట్టించుకోలేదు.
ఇంతకు అసలు విషయమేమంటే తెలంగాణలో పర్యటించాల్సి ఉన్నా ఎందుకు పర్యటించలేదని సోషల్ మీడియాలో ఓ టాక్ నడుస్తోంది. కల్వకుంట్ల కుటుంబానికి భయపడి రాలేదా? లేదా తెలంగాణలో పవన్‌కు అంతగా అభిమానులు లేరా? ఏపీలో మాదిరి తెలంగాణలో ఆదరించరేమోననే భయంతో పర్యటించ లేదా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తెలంగాణలో ప్రస్తావించాల్సిన అంశాలు లేవా? లేదా కేసీఆర్‌తో గొడవ ఎందుకు అని భావించి సైలెంట్ అయిపోయాడా? తేలాల్సిన అంశాలు ఉన్నాయి. ఎందుకు తెలంగాణలో పవన్ పర్యటించ లేదు అనేది ఏపీవాసుల్లో రేకెత్తుతున్న ప్రశ్న.